Begin typing your search above and press return to search.
అబ్బాయిల్లో అమ్మాయిలు కోరుకునేవి ఇవేనా.. అధ్యయనం చెబుతున్నది ఇదేనా?
By: Tupaki Desk | 18 Sep 2022 1:30 AM GMTఅమ్మాయిల్లో అబ్బాయిలు ఏం కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అబ్బాయిల్లో అమ్మాయిలు మరేం కోరుకుంటారు? వారి ప్రాధాన్యతలు ఏమిటి? వారి దేనికి ప్రయారిటీ ఇస్తారు? లాంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతూ ఉంటాయి. ఈ మధ్యనే కుందనపు బొమ్మలా ఉండే తమిళ నటి.. అందుకు పూర్తి భిన్నంగా భారీ కాయంతో ఉండే తమిళ నిర్మాతను ప్రేమించి పెళ్లాడిన వైనంతో అందరూ షాక్ తిన్నారు.
వీరి కాంబినేషన్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఇదిలా ఉంటే.. అబ్బాయిల అందం విషయంలో అమ్మాయిల ప్రాధాన్యత క్రమం ఏమిటన్న విషయాన్ని చెప్పే అధ్యయనం ఒకటి.. పలు ప్రశ్నలకు సమాధానంగా మారింది. కొలంబియా వర్సిటీ అధ్యయనం ప్రకారం పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ప్రేమ.. డేటింగ్ విషయానికి వచ్చినప్పుడు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు.. పెళ్లి వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారట.
ఎందుకిలా? అంటే వస్తున్న సమాధానం ఏమంటే.. అందంగా ఉండేవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువని.. మిగిలిన వారితో పోలిస్తే భాగస్వాములను మార్చటం.. బ్రేకప్ లు చెప్పటం.. మోసగించటం వీరిలో 38 శాతం ఎక్కువని తేల్చింది.
అదే సమయంలో ఏ మాత్రం అందంగా లేని వారు పడక గదిలో చెలరేగిపోతారని అధ్యయనకారులు చెబుతున్నారు. ఈ అంశాల మీద అవగాహన ఉన్నవారు పెళ్లి విషయంలో అందానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వరంటున్నారు.
బాహ్య సౌందర్యం కంటే అంత:సౌందర్యం.. వ్యక్తిత్వాన్ని ఇష్టపడే అమ్మాయిలు అందానికి ప్రాధాన్యత ఇవ్వరని.. దాని గురించి అస్సలు పట్టించుకోరని తేల్చారు. తమ కంటే అందం తక్కువగా ఉన్న వారిని పెళ్లాడితే.. పెళ్లి చేసుకున్న వారు ఆరాధనాభావం తో ఉంటారని.. తమను అపురూపంగా చూసుకుంటారని కొందరు అమ్మాయిల ఆలోచనగా చెబుతారు.
అందం కంటే మంచి కుటుంబం.. తెలివితేటలు.. వ్యక్తిత్వం.. ఆస్తిపాస్తులు.. వీటికే విలువను ఇచ్చేవాళ్లు ఉంటారని చెబుతున్నారు. అధ్యయనం ప్రకారం అందంగా లేని వారు తమను తాము నిరూపించుకోవటానికి ఇతరుల కన్నా అత్యధికంగా కష్టపడతారని.. వీళ్లు పెళ్లైతే ఒక్కరితోనే జీవితం అంటిపెట్టుకొని ఉంటారని.. ఆ వ్యక్తిత్వాన్నీ ఇష్టపడేవాళ్లు ఉంటారని చెబుతున్నారు. మొత్తంగా మగాళ్ల అందానికి అమ్మాయిలు ఇచ్చే ప్రాధాన్యత అంత ఎక్కువ కాదంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.