Begin typing your search above and press return to search.
టాంపరింగ్ గేట్: ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియన్లే..
By: Tupaki Desk | 26 March 2018 8:35 AM GMTబాల్ టాంపరిగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తోంది. ఈ సుడిగుండంలో చిక్కుకుని ఆస్ట్రేలియా క్రికెటర్లు అల్లాడిపోతున్నారు. వారిపై మిగతా క్రికెట్ ప్రపంచం కంటే సొంత దేశస్థులే విరుచుకుపడుతున్నారు. తమ క్రికెటర్లు చేసిందానికి సిగ్గుపడుతున్నామంటూ మాజీలు విమర్శిస్తున్నారు. స్వయంగా దేశ ప్రధానే స్పందించి.. క్రికెటర్లపై విమర్శలు గుప్పించాడంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న బల్ ఈ ఉదంతంపై స్పందిస్తూ.. ‘‘మిమ్మల్ని ఈ దేశమంతా గొప్పగా చూస్తుంది. రాజకీయ నాయకుల కంటే మిమ్మల్నే జనాలు ఎక్కువ గౌరవిస్తారు. కానీ మీ చర్య దిగ్బ్రాంతిని.. నిరాశను కలిగించింది. ఆస్ట్రేలియా జట్టు ఇలా మోసం చేసిందంటే నమ్మలేకపోతున్నా. మీరు చేసింది తప్పు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్య చేపడుతుందని నమ్ముతున్నా’’ అని మాల్కమ్ అన్నారు.
ఆస్ట్రేలియా జట్టు చేసిన పని తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందని.. సిగ్గుగా అనిపిస్తోందని దిగ్గజ ఆటగాడు.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డాడు. లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందిస్తూ.. ‘‘బాల్ టాంపరింగ్ చేసిన బాన్ క్రాఫ్ట్ ను చూస్తే జాలేస్తోంది. అది అతనొక్కడే తీసుకున్న నిర్ణయం కాదు. ఏదో చేయాలంటూ అతడి జేబలో ఏదో పెట్టారు’’ అన్నాడు. మరో మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ.. ‘‘మైదానంలో ఆటగాళ్లు చేసింది మన్నించరాని తప్పు. ఈ సమస్యకు ఏదో ఒక మార్గం ఉంటుంది. స్మిత్ తిరిగి కెప్టెన్ అవుతాడా? అవసరమైతే తిరిగి జట్టుకు నాయతకవ్ వహించడానికి సిద్ధం’’ అని క్లార్క్ అన్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతానికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐసీసీ విధించిన శిక్షలు చాలా తక్కువని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.