Begin typing your search above and press return to search.
హార్ట్ అటాక్ తెప్పించిన ఎంపీ, ఎమ్మెల్యే
By: Tupaki Desk | 4 Jan 2016 7:39 AM GMTఇద్దరు ప్రజాప్రతినిధుల గొడవ ఓ ఉద్యోగి ప్రాణం మీదకు తెచ్చింది. అధికార పార్టీకే చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరికివారు తమ మాటే నెగ్గాలంటూ భీష్మించుకు కూర్చోవడంతో అధికారి ఎటూ చెప్పలేక ఆందోళన చెందాడు... దీంతో ఆయనకు ఏకంగా గుండెపోటు వచ్చేసింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.
మహబూబాబాద్ లో సబ్ రిజిస్ట్రార్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం విషయంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ - ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు తీవ్రంగా గొడవపడ్డారు. ఈ రోజు ఆ నూతన కార్యాయలయాన్ని ప్రారంభించగా ఇద్దరు నేతలూ అక్కడికి వచ్చారు. అయితే... సోమవారం నాడు ప్రారంభోత్సవం ఏంటంటూ ఎంపీ సీతారాంనాయక్ అభ్యంతరం చెప్పారు. ఈ రోజు చేయొద్దంటూ ఆయన వాదించారు. అందుకు ప్రతిగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎట్టిపరిస్థితుల్లో ఈరోజు చేయాల్సిందేనని పట్టుపట్టారు. ఇద్దరూ తీవ్రంగా వాదులాడుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కార్యక్రమంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ చాలా ఆందోళన చెందారు. తమ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ, ఎమ్మెల్యేలు గొడవ పడడంతో ఇది ఎక్కడి దారితీస్తుందో.. ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందారు. వారిద్దరూ గొడవపడుతుండగానే ఆయనకు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది. ఉన్న పళంగా ఆయన గుండె పట్టకుని కుప్పకూలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యేల చిల్లర తగాదాలు ఒక అధికారి ప్రాణానికే ప్రమాదం తెచ్చాయి.