Begin typing your search above and press return to search.
‘ఇచిరో ఒకురా’’ పేరుతో బోస్ అంత్యక్రియలు
By: Tupaki Desk | 22 Jan 2016 5:30 AM GMTస్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన కన్య్ఫూజన్ తొలిగిపోయేలా ఆధారాలు ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. బోస్ మరణించిన ఇంతకాలానికి (?) కూడా చాలానే సందేహాలు ఉన్నాయి. నిజంగానే అందరూ అనుకున్నప్పుడే ఆయన మరణించారా? లేదంటే రహస్య జీవనం చేపట్టారా? లాంటి డౌట్లు చాలానే ఉన్నాయి. అయితే.. బోస్ మరణానికి సంబంధించిన ఆధారాల్ని ఒకచోటకు చేర్చి ఆ వివరాల్ని అందిస్తున్న బ్రిటన్ వెబ్ సైట్ ‘బోస్ ఫైల్స్ ఇన్ఫో’ తాజాగా ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాల్ని తాజాగా బయటపెట్టారు.
తాజాగా బయట పెట్టిన వివరాల ప్రకారం.. 1945 ఆగస్టు 22న బోస్ మరణం తర్వాత తైవాన్ రాజధాని తైపీ నగరంలో బోస్ అంత్యక్రియల్ని నిర్వహించినట్లుగా తేల్చారు. అయితే.. బోస్ పేరు మీదట కాకుండా.. ‘ఇచిరో ఒకురా’ అనే పేరుతో ఆయన మరణధ్రువీకరణ పత్రాన్ని సిద్ధం చేసినట్లుగా సదరు వెబ్ సైట్ పేర్కొంది. దీనికి సంబంధించి బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో ‘FC 1852/ 6 పేరిట ఉన్న తైవాన్ అధికారి సాక్ష్య పత్రాన్ని సదరు వెబ్ సైట్ ప్రపంచానికి అందించింది. ఈ పత్రాన్ని 1956లో సిద్ధం చేశారు.
సదరు వివరాల ప్రకారం బోస్ అంత్యక్రియలు జరిగిన తీరు చూస్తే చాలా వరకూ వాస్తవాలన్నట్లే అనిపించక మానవు. ఈ వివరాల్ని అంత్యక్రియలకు అనుమతులు జారీ చేసిన అధికారి ‘‘టాన్ టి-టి’’ సాక్ష్యం ఇచ్చారు. అతని మాటల ప్రకారం..
= 1945 ఆగస్టు 21న బోస్ మృతదేహానికి ‘ఇచిరో ఒకురా’ పేరుతో మరణధ్రువీకరణ పత్రం ఇచ్చారు.
= 1945 ఆగస్టు 22న తైపీలో అంత్యక్రియలు నిర్వహించారు.
= ఆగస్టు 22న జపాన్ అధికారి.. ఒక భారతీయుడితో కలిసి కారులో ఒక శవపేటికతో వచ్చారు.
= ఒక ముఖ్యమైన పని మీద టోక్యో వెళుతుండగా విమాన ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.
= రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైనిక మృతుల బంధువులు అందుబాటులో లేకుంటే సైనిక ఆసుపత్రుల మరణ ధ్రువీకరణ ప్రత్రంతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
= బోస్ అంత్యక్రియలు అదే రీతిలో జరిగాయి.
= నిజానికి శవపేటికను టోక్యోకు తీసుకెళ్లాలని అనుకున్నా.. అంత పెద్ద పెట్టెను తీసుకెళ్లే విమానాలు అందుబాటులో లేకుండా ఉండటంతో తైపీలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
= బోస్ మృతదేహాన్ని తీసుకొచ్చిన జపాన్ సైనికాధికారితో పాటు వచ్చిన భారతీయులు బోస్ సహాయకుడు కల్నల్ హబీబుర్ రెహ్మాన్ అయి ఉండొచ్చు.
= అంత్యక్రియలు పూర్తి అయిన పక్కరోజున (ఆగస్టు 23)న ఆస్తికలను తీసుకెళ్లారు. ఇలా బోస్ అంత్యక్రియలు మారుపేరుతో జరిగినట్లుగా సదరు వెబ్ సైట్ పేర్కొంది.