Begin typing your search above and press return to search.
చంద్రబాబుతో సుభాష్ ఘయ్ భేటీ!
By: Tupaki Desk | 5 Sep 2017 1:52 PM GMTఏపీ సీఎం చంద్రబాబునాయుడును ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్ మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకుగాను ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని చంద్రబాబును సుభాష్ ఘయ్ కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు కూడా సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తోంది. విభజనానంతరం ఆంధ్ర ప్రదేశ్ లో ఫిల్మ్ - టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అమరావతి - విశాఖ పట్నం లలో వాటిని ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన యువతకు నటనలో శిక్షణను ఇప్పించాలనుకుంది. అమరావతిలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు జులైలో 14 మంది సభ్యులతో ఓ కమిటీని కూడా ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుభాష్ ఘయ్ ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా సుభాష్ ఘయ్ హైదరాబాద్ లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఐటీ మంత్రి కేటీఆర్ ను సంప్రదించారు. దానికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్...రాచకొండలో ఆ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక యువతకు నటనలో శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ముంబైలో సుభాష్ ఘయ్ విజ్ లింగ్ వుడ్స్ పేరుతో ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను పదేళ్లుగా నిర్వహిస్తున్నారు. అదే తరహాలో ప్రపంచ స్థాయి ఇన్ స్టిట్యూట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కేటీఆర్ ను సుభాష్ ఘయ్ కలిశారు.