Begin typing your search above and press return to search.
యువరాజు భారతీయుడు కాదంట!
By: Tupaki Desk | 16 Nov 2015 1:46 PM GMTసంచలన విమర్శలు.. ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్ అయిన సుబ్రమణ్యస్వామి తాజాగా గళం విప్పారు. ఈసారి ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. కాంగ్రెస్ యువరాజుగా పిలుచుకునే రాహుల్ గాంధీపై గురి పెట్టారు. రాహుల్ అసలు భారతీయుడే కాదని చెబుతున్నారు. ఆయన బ్రిటన్ పౌరుడంటూ కొత్త దుమారాన్ని రేపుతున్నారు. ఆయన భారతీయుడు కాదంటూ తాను చెబుతున్న మాటలకు తగ్గట్లుగా కొన్ని పత్రాల్ని ఆయన చూపిస్తున్నారు. రాహుల్ ను మొదట ఎంపీ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని.. ఆయన పౌరసత్వంపై తాను చేస్తున్న ఆరోపణలకు తగిన పత్రాల్ని ప్రధాని.. లోక్ సభ స్పీకర్ కు పంపుతున్నట్లు చెప్పారు.
బ్రిటీష్ పౌరుడైన రాహుల్ చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని స్వామి డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రమణ్య స్వామి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. వరదల కారణంగా జనం భారీగా చనిపోతున్నా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్పందించటం లేదని విమర్శించారు. తాను చేపట్టే ప్రతి పథకానికి అమ్మ పేరు మీద పెట్టే జయలలితపై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ.. అమ్మ డ్రైనేజీ స్కీమ్ సరిగా పని చేయటం లేదంటూ.. రహదారులపై నిలిచిన వర్షపు నీటిని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.