Begin typing your search above and press return to search.
ప్రభుత్వం చేతిలో తిరుమల: కేసు చివరి దశకు వచ్చిందని స్వామి ట్వీట్
By: Tupaki Desk | 14 Jun 2020 11:41 AM GMTహిందువులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణ నుంచి తప్పించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తేల్చుకోవాలని భారత అత్యున్నతన్యాయస్థానం సూచించింది. ఈ అంశంపై స్వామి మరోసారి షాకింగ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టులో చివరి దశలో ఉందని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా తెలిపారు. తిరుమల ఆలయం - తిరుచానూరు పద్మావతి దేవాలయంతో పాటు మొత్తం పదకొండు ఆలయాలతోనే దేశంలోనే అత్యంత ధనిక ఆలయమైన తిరుమల గత రెండు తరాలుగా ఏపీ ప్రభుత్వం నియంత్రణలో ఉందని సుబ్రహమణ్యస్వామి పిటిషన్లో పేర్కొన్నారు.
1987 ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం హిందూ ధార్మిక క్షేత్రాలను ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించాలని ఆయన అందులో కోరారు. ధార్మిక క్షేత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించడం హిందువుల హక్కులకు వ్యతిరేకమన్నారు. సుబ్రమణ్యస్వామి చేసిన ఈ ట్వీట్ ను రమణదీక్షితులు రీట్వీట్ చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం అంటే 2018 సెప్టెంబర్ లో వచ్చిన వార్తను సుబ్రమణ్యస్వామి ఓ ట్వీట్ చేస్తూ - దానికంటే ముందే ప్రస్తుతం ఇది ఏపీ హైకోర్టులో చివరి దశలో ఉందని ట్వీట్ చేశారు.