Begin typing your search above and press return to search.

కొత్త పంచాయ‌తీ మొదలుపెట్టిన స్వామి

By:  Tupaki Desk   |   29 Oct 2016 4:12 AM GMT
కొత్త పంచాయ‌తీ మొదలుపెట్టిన స్వామి
X
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుదీర్ఘ కాలం త‌ర్వాత ఆస‌క్తిక‌ర‌మైన డిమాండ్‌ తో తెర‌మీద‌కు వ‌చ్చారు. సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించి రతన్‌ టాటాను తాత్కాలిక ఛైర్మన్‌ గా నియమించిన అనంతరం మిస్త్రీ టాటా గ్రూప్‌ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి స్పందిస్తూ టాటా గ్రూప్‌ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు మల్టి-ఏజెన్సీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. సీబీఐ - ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ - సెబీ తదితర అధికారులతో కూడిన సిట్‌ ను నియమించాలని ఆయన మోడీకి లేఖ రాశారు. త‌ద్వారా కార్పోరేట్ లావాదేవీల గురించి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంద‌న్నారు.

ఎయిర్ ఏసియా - విస్తారా ఎయిర్‌ లైన్స్‌ లో రతన్‌ టాటా పాత్రపై ప్రశ్నిస్తూ గతంలోనే ప్ర‌ధాన‌మంత్రి మోడీకి లేఖ రాసినట్లు స్వామి తెలిపారు. తాజాగా అదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఎయిర్ ఏసియాకు సంబంధించి మోసపూరిత లావాదేవీలు జరిగాయని.. వీటి గురించి టాటా బోర్డు సభ్యులకు - ట్రస్టీలకు కూడా తెలుసని అందుకే ఈ విషయంపై విచారణ జరుగుతోందని స్వామి వివ‌రించారు దేశ చట్టాల ఉలంఘనకు సంబంధించిన విష‌యం కాబ‌ట్టి క‌ఠిన ద‌ర్యాప్తు త‌ప్ప‌నిస‌రి అని స్వామి అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఈ ప‌రిణామంపై స్పందిస్తూ టాటాల ఎయిర్‌ ఏసియా లావాదేవీలకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలిస్తున్నామని, చట్ట ప్రకారం ముందుకెళ్తామని వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/