Begin typing your search above and press return to search.
గోవులపై స్వామి మార్క్ ఐడియాను విన్నారా?
By: Tupaki Desk | 19 Jun 2017 2:38 PM GMTఊహించని రీతిలో వ్యాఖ్యలు చేయటం.. తన మాటలతో సరికొత్త చర్చను రేపటం రాజ్యసభ సభ్యుడు.. తమిళనాడు బీజేపీ సీనియర్ సుబ్రమణ్యస్వామికి అలవాటు. ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలేమీ చేయని ఆయన.. తాజాగా ఆ కొరత తీరుస్తూ కొత్త వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి ఉన్న పన్నులు సరిపోవన్నట్లుగా మోడీ సర్కారుకు సరికొత్త పన్ను ఐడియాను చెప్పుకొచ్చారు.
ఈ పన్నుఐడియా కొందరికి నచ్చేలా.. మరికొందరికి మంటపుట్టేలా ఉండటం విశేషం. దేశ వ్యాప్తంగా ఉన్న గోశాలలకు ఫండింగ్ కోసం పెట్రోల్ పై సెస్ విధించాలన్నది స్వామి అభిలాష. గో రక్షణ పేరుతో విరాట్ హిందుస్తాన్ సంఘం నిర్వహించిన జాతీయ సదస్సులో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరికొత్త పన్నుపోటు ప్రజలు మీద వేయాలని చెప్పారు.
ఇంతకీ స్వామి వేయమన్న పన్ను ఎందుకన్నది చూస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న గోశాలలకు ఫండింగ్ కోసమని చెబుతున్నారు. ఇందుకోసం పెట్రోల్ మీద లీటరుకు రూపాయి చొప్పున సెస్ వేయాలన్నారు. గోశాలల కోసం పెట్రోల్ పై రూపాయి సెస్ ను ప్రజల్ని అడిగితే దేశం మొత్తం ద్రవ్యంతో నిండిపోతుందన్నారు. సుబ్రమణ్యస్వామి ఈ ఐడియా ఇస్తే.. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి హన్సురాజ్ ఒక అడుగు ముందుకు వేసి.. గోవుల అభయారణ్యం కోసం 7 కోట్ల ఎకరాల భూమిని కేటాయించాలని తాను ప్రతిపాదిస్తున్నట్లుగా చెప్పారు. టైగర్ అభయారణ్యం ఏ విధంగాఉంటుందో అదే తీరులో గోవులతో ఏర్పాటు చేయాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.
వీటితో పాటు గోవుల రక్షణ కోసం పాఠ్య పుస్తకాల్లో కచ్ఛితంగా పాఠ్యాంశంగా మార్చాలన్నారు. ఇక.. తాజాగా మోడీ సర్కారు తీసుకొచ్చిన గోవుల అమ్మకాల చట్టాన్ని ఆయన సమర్థించారు.మరి.. స్వామి చెప్పిన గోరక్షణ పన్నుపోటు ప్రజల మీద వేస్తారా? అన్నది చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/