Begin typing your search above and press return to search.

స్వామి సామాన్యుడు కాదండోయ్..

By:  Tupaki Desk   |   16 Dec 2016 5:00 PM GMT
స్వామి సామాన్యుడు కాదండోయ్..
X
సంచలన ఆరోపణలు..తీవ్రమైన విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. వివాదాస్పద అంశాల్ని నిత్యం తెరమీదకు తీసుకొచ్చి వార్తల్లో నిలిచే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. దేశంలోనే బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటాపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేనా.. ఆయనపై మనీ లాండరింగ్ ఆరోపణలు చేస్తూ కేసు ఫైల్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందేందుకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు.

గతంలో 2జీ కుంభకోణాన్ని తెర మీదకు తీసుకొచ్చిన స్వామి.. నాటి కేంద్రమంత్రి రాజాతో పాటు.. పలువురిపై తీవ్ర ఆరోపణలు చేయటమే కాదు.. వారికి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించటంలో కీలకభూమిక పోషించారు. ఈ రోజు (శుక్రవారం) సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసిన ఆయన.. మాజీ మంత్రి రాజా.. కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా తదితరులను విచారించాలన్న ఆయన.. టాటా సన్స్ మధ్యంతర ఛైర్మన్ రతన్ టాటా.. యూనిటెక్ అధికారులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ కేసులో గుర్తు తెలియని సీబీఐ అధికారులు రతన్ టాటాను రక్షిస్తున్నారంటూ ఆరోపించిన ఆయన.. మనీ లాండరింగ్ చట్టంలోని పలు సెక్షన్ల పైన రతన్ టాటాపై ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణకు స్వీకరించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జనవరి 11న జరగనుంది. తాను టార్గెట్ చేసిన వారందరికి చుక్కలు చూపించే సుబ్రమణ్య స్వామి.. రతన్ టాటా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/