Begin typing your search above and press return to search.

త‌మిళ దుమారం గ‌వ‌ర్న‌ర్ పై ప‌డింది

By:  Tupaki Desk   |   8 Feb 2017 10:49 AM GMT
త‌మిళ దుమారం గ‌వ‌ర్న‌ర్ పై ప‌డింది
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో నెల‌కొన్న అనిశ్చితి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప‌డింది. సీనియ‌ర్ నేత‌ - బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి స్పందించారు. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ వెంట‌నే శ‌శిక‌ళ ప్ర‌మాణ స్వీకారం నిర్వ‌హించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌వేళ ప్ర‌మాణ స్వీకారాన్ని వాయిదా వేస్తే, అది రాజ్యాంగ ఉల్లంఘ‌న అవుతుంద‌న్నారు. ఈ అంశంలో రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ జోక్యం చేసుకోవాల‌న్నారు. ప‌న్నీరు సెల్వంకు కానీ, శ‌శిక‌ళ‌కు కానీ తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని, తాను కేవ‌లం రాజ్యాంగానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు సుబ్ర‌మ‌ణియ‌న్ చెప్పారు. అయితే శ‌శిక‌ళ ప్ర‌మాణ స్వీకారం అంశంలో గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు అందుబాటులో లేక‌పోవ‌డం ప‌ట్ల బీజేపీ ఎంపీ త‌న అభిప్రాయాన్ని వినిపించారు. ప్ర‌స్తుత త‌మిళ‌నాడు ప‌రిస్థితిపై రాష్ట్ర‌ప‌తికి వివ‌రించ‌నున్న‌ట్లు, ఒక‌వేళ గురువారం లోగా గ‌వ‌ర్న‌ర్ చెన్నై వెళ్ల‌ని ప‌క్షంలో అత‌న్ని తొలిగించాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోర‌నున్న‌ట్లు సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి తెలిపారు.

కాగా... ఇవాళ అపద్దర్మ సీఎం పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగు బావుట ఎగురవేశారు. తాను సీఎం పదవికి చేసిన రాజీనామాను కార్యకర్తలు - ప్రజలు కోరితే ఉపసంహరించుకుంటానని కూడా ప్రకటించారు. గ‌వర్నర్‌ విద్యాసాగర్‌ రావు చెన్నై వస్తే తప్పనిసరిగా కలుస్తానని పన్నీర్‌ సెల్వం అన్నారు. శాసనసభ జరిగితే నాకు మద్దతిచ్చే సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటానని స్పష్టం చేశారు. మ‌రోవైపు తమిళనాడు రాజకీయాలు గంటగంటకు రక్తి కట్టిస్తున్నాయి.తాజా ట్విస్ట్ లో భాగంగా అపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వంను తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప జయకుమార్ ఇవాళ కలిశారు. ఈమేరకు వార్తలు వెలువడ్డాయి. కాగా, జయలలిత మేనకోడలు దీప జయకుమార్ తనతో కలిసి వస్తానంటే ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలాఉండ‌గా...తమిళనాడులో పరిస్థితిపై గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు అధ్యయనం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మీడియాతో వెంకయ్య మాట్లాడారు. పన్నీర్‌ సెల్వం - శశికళ వివాదంలో కేంద్రం పాత్ర లేదని తెలిపారు. గవర్నర్‌ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/