Begin typing your search above and press return to search.
బ్యాంక్‌కు మోడీ ఆప్తుడి టోకరా..బీజేపీ ఎంపీ ఫైర్
By: Tupaki Desk | 8 March 2018 4:21 AM GMTసంచలన కామెంట్లకు పెట్టింది పేరయిన బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు తీవ్రంగా తప్పుపట్టారు. 'ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని అదానీ గ్రూప్ చెల్లించలేదు. ఈ రుణాల్ని ప్రభుత్వ బ్యాంకులు 'మొండి బకాయిల' జాబితాలో చేర్చింది. అతన్ని ఎవరూ ప్రశ్నించటం లేదు. దేశంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి(ప్రధాని నరేంద్రమోడీ)తో అదానీ సన్నిహితంగా మెలగటమేంటి ? అది కేంద్రానికి సిగ్గుచేటు'స...అంటూ ట్విట్టర్ లో సుబ్రహ్మణ్యస్వామి నిలదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి - కార్పొరేట్ లాబీకి మధ్య ఏదో ఉందన్న అనుమానాల్ని ఈ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
నౌకాశ్రయాల నిర్మాణం - విద్యుత్తు - బొగ్గు వ్యాపారం..తదితర రంగాల్లో 'అదానీ గ్రూప్' కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి సంబంధించి సుబ్రహ్మణ్యస్వామి లేవనెత్తిన అనుమానాలు ఇలా ఉన్నాయి.. ''బ్యాంకుల నిరర్థక ఆస్తులకు అదానీని బాధ్యుడ్ని చేయాల్సిన తరుణం వచ్చింది. లేకుంటే ఈ విషయంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తాను. అదానీ గ్రూపు సంస్థలపై ఉన్న కేసులు - నిరర్ధక ఆస్తులు - బొగ్గు దిగుమతులు - ఆస్ట్రేలియాలోని ఆయన వ్యాపార కార్యకలాపాలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవాలి. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రూ.72 వేల కోట్ల రుణాల్ని మొండి బకాయిల జాబితాలో చేర్చారు. ఇందులో నిజానిజాల్ని తేల్చాలి''అని ట్విట్టర్ ద్వారా స్వామి తేల్చిచెప్పారు.
ఇదిలాఉండగా...తమపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. `తక్కువ సమయంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టిన చరిత్ర మాకుంది. మూలధనం ఎక్కువగా అవసరమయ్యే (క్యాపిటల్ ఇంటెన్సివ్) పరిశ్రమలకు రుణాలు అనివార్యమవుతాయి. దేశీయ - అంతర్జాతీయ బాండ్లు ఈసీబీ రుణాలు - ప్రభుత్వ - ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి రుణాలు మాకు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ప్రభుత్వ - ప్రయివేటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సుమారుగా రూ.34 వేల కోట్లు. వీటిని నిర్ణీత కాల వ్యవధితో రుణ వాయిదాల్ని చెల్లిస్తున్నాం.` అని పేర్కొంది.