Begin typing your search above and press return to search.

తీర్పు తర్వాత కేసు వేసిన స్వామి మాట

By:  Tupaki Desk   |   14 Feb 2017 8:09 AM GMT
తీర్పు తర్వాత కేసు వేసిన స్వామి మాట
X
వివాదాలకు కేంద్రబిందువుగా.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా కనిపించే స్వామి ఎంత డేంజర్ అన్న విషయం తాజా పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అప్పట్లో బోఫోర్స్ కానీ.. మన్మోహన్ సర్కారు ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేసిన 2జీ స్కామ్ కానీ.. తాజాగా శశికళకు జైలు కానీ.. ఇవన్నీ సుబ్రమణ్యస్వామి పుణ్యాలే. ఆయన కానీ ఫోకస్ చేసి.. కేసు వేశారా? కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే.

అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం అమ్మ అక్రమాస్తుల వ్యవహారంపై కేసు వేసిన సుబ్రమణ్య స్వామి పుణ్యమా అని.. ఆ కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి.. మలుపులెన్నింటినో దాటి చివరకు నిందితులు దోషులుగా మారే పరిస్థితి. ఈ రోజు చిన్నమ్మ జైలుకు వెళుతున్నారంటే.. అందుకు పూర్తి కారణంగా సుబ్రమణ్య స్వామి అప్పట్లో చేసిన ఫిర్యాదుగానే చెప్పాలి.

తప్పు చేసిన వారు ఎప్పటికి తప్పించుకోలేరన్న మాటకు చిన్నమ్మ ఉదంతం తాజా నిదర్శనం అయితే.. సుబ్రమణ్యస్వామి కానీ టార్గెట్ చేశారంటే.. వారికి చుక్కలేనని మరోసారి తేలిపోయింది. తాను వేసిన కేసుకు సంబంధించి కీలక తీర్పు వచ్చిన వేళ సుబ్రమణ్యస్వామి స్పందించారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విశేషాన్ని చెప్పాలి. శశికళను సీఎం కావటాన్ని ఎవరూ ఇష్టపడని వేళ.. ఆమెను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలంటూ ఇదే స్వామి ఓపెన్ గా చెప్పటం మర్చిపోలేం. ఎందుకలా అంటే.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. చిన్నమ్మను సీఎంను చేయాల్సిందే అంటారు.

తీర్పు నేపథ్యంలో స్వామి రియాక్షన్ చూస్తే.. 20 ఏళ్ల తర్వాత న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. శశికళను కోర్టు దోషిగా తేలుస్తుందని తాను ఊహించినట్లుగా వెల్లడించారు. 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి.. డీఎంకే అధికారంలోకి వచ్చిన వేళలో స్వామి ఈ అక్రమాస్తుల కేసును కోర్టులో దాఖలు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/