Begin typing your search above and press return to search.
ఆ మహిళా కేంద్రమంత్రి హీరో ఆయనేనట
By: Tupaki Desk | 6 Jun 2016 6:17 AM GMTకేంద్రమంత్రి ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. రాజకీయాల్లో తల పండిన నాయకులు తమ తీరుకు ఏ మాత్రం సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తే చర్చనీయాంశాలుగా మారతాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఉమాభారతి వ్యాఖ్యలున్నాయి. కాంగ్రెస్ పార్టీని.. గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసి మరీ.. తెగ ఇబ్బంది పెడుతున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి మీద ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాలో విశేష ప్రాధాన్యం లభించిన ఈ వ్యాఖ్యల్ని చూస్తే.. ఉమాభారతి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్న సందేహం కలగటం ఖాయం.
బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి గురించి ఉమాభారతి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ‘‘సుబ్రమణ్య స్వామి నా హీరో. అందుకే ఆయనేం చెబితే దాన్ని నమ్ముతా. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం అవుతాయన్న ఆయన మాటల్ని నమ్ముతున్నా’’ అని వ్యాఖ్యానించారు. మిగిలిన వ్యాఖ్యలు ఒకలాంటి ఆసక్తిని రేకెత్తిస్తే.. ‘హీరో’ మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పక తప్పదు.
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని బలంగా వాదన వినిపించే నేతల్లో ఉమాభారతి ఒకరన్న విషయం తెలిసిందే. అలాంటి ఆమెకు.. దశాబ్దాల కల నిజమయ్యేలా ఒకరు భరోసా ఇస్తూ మాట్లాడటం ఆమెను ఆకట్టుకొని ఉండొచ్చు. అందుకే.. ఈ తరహా వ్యాఖ్య చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న ఆలోచనలో అయోధ్యలోని రెండు పక్షాలు ఉన్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం దక్కితే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది..?