Begin typing your search above and press return to search.
రాజన్ ను ఇంటికి పంపే వరకూ నిద్రపోయేటట్లు లేడే
By: Tupaki Desk | 17 May 2016 9:51 AM GMTబీజేపీ రాజ్యసభ సభ్యుడు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సుబ్రమణ్యస్వామి మరోసారి చెలరేగిపోయారు. ఏదైనా టార్గెట్ చేస్తే దాని అంతు చూసే వరకూ నిద్రపోని తత్వం ఉన్న సుబ్రమణ్య స్వామి తాజాగా ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మీద స్పెషల్ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయలో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ ను నియమించిన సంగతి తెలిసిందే.
రాజన్ కు మోడీ సర్కారుకు మధ్య టర్మ్స్ సరిగా లేవన్న వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ.. మొన్ననే రాజన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం.. ఆయన్ను చికాగోకు(ఇంటికి) పంపాలని డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే.. తాజాగా రాజన్ తీరును తీవ్రంగా తప్పుపడుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
భారత ఆర్థిక వ్యవస్థకు రాజన్ ప్రమాదకారిగా మారారని.. ఆయన వ్యక్తిగతంగా పూర్తిస్థాయి భారతీయుడిగా వ్యవహరించటం లేదన్న తీవ్ర వ్యాఖ్యను చేశారు. రాజన్ పై స్వామి తాజా లేఖాస్త్రం చూస్తుంటే.. ఆర్ బీఐ గవర్నర్ స్థానం నుంచి ఆయన్ను తప్పించాలన్న కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు.