Begin typing your search above and press return to search.

ఈసారి పీఎంవో మీద పడ్డ సుబ్రమణ్య స్వామి

By:  Tupaki Desk   |   5 May 2021 5:30 PM GMT
ఈసారి పీఎంవో మీద పడ్డ సుబ్రమణ్య స్వామి
X
బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామికి తన పర బేధాలుండవు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మీదపడిపోతాడు. సొంత పార్టీనా.. ప్రత్యర్థి పార్టీనా అని ఆయన చూడరు. ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని నిలదీస్తాడు. సొంత పార్టీపై కూడా అదే స్థాయిలో ఈయన విరుచుకుపడుతాడు.

తాజాగా సొంత బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఏకంగా 'పీఎంవో సైకోలు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఎంత మేరకు నష్టం చేస్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ దారుణాలకు కారణమవుతోంది. ఆస్పత్రులు నిండి.. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సుబ్రహ్మణ్య స్వామి సూచించారు.

కాగా బుధవారం ఇదే విసయాన్ని తిరిగి ప్రస్తావిస్తూ సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సుబ్రహ్మ స్వామి సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

'కోవిడ్ థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నేను రెండు రోజుల క్రితం హెచ్చరించాను. ఈరోజు నీతి అయోగ్ సభ్యుడు కూడా కోవిడ్ థర్డ్ వేవ్ ను నిర్ధారించారు. కోవిడ్ ను అరికట్టడానికి సరైన వ్యూహరచన చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పీఎంవో సైకోలు కాకుండా ప్రత్యేకమైన టీం కావాలి' అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సొంత ప్రభుత్వంలోని కీలకమైన పీఎంవోపై సుబ్రహ్మణ్యస్వామి 'సైకోలు' అని ప్రస్తావించడం దుమారం రేపింది.