Begin typing your search above and press return to search.

రాహుల్ పెళ్లి మీద జస్ట్ జోకేశాడంట

By:  Tupaki Desk   |   6 July 2016 9:11 AM GMT
రాహుల్ పెళ్లి మీద జస్ట్ జోకేశాడంట
X
అదేం చిత్రమో కానీ.. చాలామంది రాజకీయ వారసులకు లేని ఇబ్బందులు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకే ఉంటాయి. ఆయన్ను టార్గెట్ చేయాలనుకునే వారు ఆయన్ను ఇట్టే అనేయటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా ఆయనపై విరుచుకుపడటానికి కొన్ని కారణాలు ఆయన వైరి వర్గానికి ఉండటం గమనార్హం. నిన్నటికి నిన్న తనకున్న సమాచారం ప్రకారం రాహుల్ త్వరలో పెళ్లి కొడుకు అవుతున్నాడంటూ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యతో ఒక్కసారి అందరి అటెన్షన్ ను తన వైపుకు తిప్పుకున్న సుబ్రమణ్య స్వామి.. తాజాగా అసలు విషయాన్ని చెప్పేశారు.

సుబ్రమణ్య స్వామి లాంటి నేత నోటి వెంట తనకు అందిన సమాచారం ప్రకారం రాహుల్ పెళ్లి కొడుకు అవుతున్నారన్న విషయాన్ని వెల్లడించటం అంటే.. ఏదో పక్కా సమాచారం స్వామికి అంది ఉంటుందని చాలామంది అనుకున్నారు. అయితే.. అలాంటిదేమీ లేదని.. తాను జస్ట్ జోకేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. రాహుల్ పెళ్లి అంటే.. పశ్చిమాన సూర్యుడు ఉదయించటమే అనే అర్థం వచ్చేలా చేసిన తన తాజా ట్వీట్ తో స్వామి తన అసలు ఉద్దేశం ఏమిటన్నది చెప్పేశారు.

రాహుల్ ను టార్గెట్ చేయటానికి ‘పెళ్లి’ మాటతో ఆడుకున్నారన్నది ఇప్పుడు అందరికి అర్థమైంది. స్వామి నోటి వెంట వచ్చిన రాహుల్ పెళ్లి మాటతో ఎన్నో ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. మొత్తానికి తాను చెప్పిందంతా జస్ట్ జోకేనన్న తీరులో చెప్పేసి విషయాన్ని తేల్చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పరువు తీయటానికే స్వామి పెళ్లి ముచ్చటను తెరపైకి తీసుకొచ్చారంటూ మండిపడుతున్నారు. అసలే స్వామి.. అందులోకి రాహుల్ ను టార్గెట్ చేయటానికి ఏ చిన్న అవకాశం లభించినా ఊరుకుంటారా చెప్పండి..?