Begin typing your search above and press return to search.
కరుణానిధిపై ఐటీ దాడులు జరగవా?: స్వామి
By: Tupaki Desk | 9 Nov 2017 1:00 PM GMTతమిళనాడులో ఐటీ శాఖ అధికారుల దెబ్బకు జయలలిత నిచ్చెలి శశికళ కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. శశికళ భర్త నటరాజన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరి ఇళ్లు - కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మన్నార్ గుడి మాఫియాకు చెందిన 187 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో చేసిన దాడులతో ఆ ముఠా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జయలలితకు వైద్య చికిత్సలు చేసిన శశికళ బంధువు డాక్టర్ శివకుమార్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు జయలలితకు చెందిన కోడనాడు ఎస్టేట్ లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులను బీజేపీ సీనియర్ నాయకుడు - రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను చెప్పదలుచుకున్న విషయాలను నిర్మొహమాటంగా వెల్లడించడంలో సుబ్రమణ్య స్వామికి తిరుగులేదు. శత్రుఘ్న సిన్హా తరహాలో స్వపక్షమైనా - విపక్షమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయనక అలవాటు. తాజాగా, బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు తమిళనాడు బీజేపీ నాయకులను ఇరకాటంలో పడేశాయి. శశికళపై కోర్టుకు ఫిర్యాదు చేసిన సమయంలోనే తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి - డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి - ఆయన కుమార్తె కనిమోళిపై కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఆ సమయంలో అధికారులకు 30 పేజీల వివరాలు ఇచ్చినా వారిపై ఇప్పటివరకు ఐటీ దాడులు ఎందుకు జరగలేదని గురువారం సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీంతో, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.
సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు తమిళనాడు బీజేపీ నాయకులను ఇరకాటంలోకి నెట్టాయి. ఈ దాడులపై వారు స్పందించారు. శశికళ కుటుంబ సభ్యుల మీద దాడులకు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పారు. ఐటీ శాఖ అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగానే దాడులు చేస్తున్నారని తెలిపారు. అయితే, కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ....కరుణానిధి ఇంటికి వెళ్లడం, ఆ వెంటనే ఈ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గతంలో నోట్ల రద్దును వ్యతిరేకించిన డీఎంకే...మోడీ పర్యటన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుంది. నిన్న జరిగిన బ్లాక్ డే నిరసనలలో పాల్గొనాలని నిర్ణయించుకున్న డీఎంకే మోడీ పర్యటన అనంతరం యూ టర్న్ తీసుకుంది.