Begin typing your search above and press return to search.
శ్రీదేవిని హత్య చేశారంటూ బాంబు పేల్చిన స్వామి
By: Tupaki Desk | 27 Feb 2018 6:49 AM GMT శ్రీదేవి మరణంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కన్నీరు పెట్టుకుంది. మరణించి రోజులు గడుస్తున్నా ఆమె ఎందుకు చనిపోయింది అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. దీంతో శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎంపీ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేగుతుంది. శ్రీదేవిని హత్య చేశారని - ఆమెతో ఎవరో బలవంతంగా మద్యం తాగించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలు అనుమానాల్ని లేవనెత్తిన ఆ ఎంపీ శ్రీదేవి మరణం - తారలతో - డాన్ దావూద్ ఇబ్రహీంకు ఉన్న సంబంధాల్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తొలుత శ్రీదేవి దుబాయ్ లోని హోటల్ బాత్రూంలో పడి చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. వైద్యులు మాత్రం ఆమె బాత్రూం టబ్ లో పడిపోవడం వల్లే చనిపోయారని నివేదిక అందించారు. మరోవైపు ఆమె బాడీలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఇలా క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్న శ్రీదేవి మరణంపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు తలెత్తున్నాయి.
శ్రీదేవి బాత్రూంలో మరణించిన సమయంలో బోనీ కపూర్ ఎక్కడున్నాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. అయితే కేసు ఓ కొలిక్కి తెచ్చేందుకు దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.
ప్రాసిక్యూషన్ ప్రారంభించిన బృందం కొన్ని ప్రశ్నల్ని సంధిస్తూ శ్రీదేవి భర్త బోనీకపూర్ పై అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు గంటలతరబడి విచారించింది. కానీ బోనీ కపూర్ మాత్రం పొంతలేని సమాధానాలు చెబుతున్నారు. బోనీ కుటుంబసభ్యులు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని చెబుతుంటే..బోనీ మాత్రం సైలెంట్ గా ఉండడంతో ప్రాసిక్యూషన్ సభ్యుల్ని అసహనానికి గురి చేస్తుంది. దీంతో బోనీని - అతని కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. విచారణలో గంటలు గడుస్తున్న శ్రీదేవి మరణం కొలిక్కి రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకెందుకు శ్రీదేవి ఎందుకు మరణించిందో ప్రాసిక్యూషన్ జరుగుతుంది. రిపోర్టు అదిగో వస్తుంది . ఇదిగో వస్తుందని కాలయాపన జరుగుతున్న తరుణంలో దుబాయ్ ఖలీజ్ టైం శ్రీదేవి మరణంపై ప్రాసిక్యూషన్ బోనీని విచారించలేదని చావుకబురు చల్లగా చెప్పింది. దీంతో ఆందోళన వ్యక్తంచేస్తున్న ఆమె అభిమానులు శ్రీదేవి ఎందుకు మరణించిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మనసులో మాటను భయటపెట్టారు. స్వతహగా స్వామి ఏం చెప్పినా ఊరికే చెప్పడు . అందులో ఏదో అర్ధం . పరమార్ధం దాగి ఉంటుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడతారు. కాబట్టే స్వామి ఒక అంశాన్ని లేవనెత్తారంటే ఆ విషయంపై ఎదురు ప్రశ్నించే సాహసం ఎవరు చేయరు. అలా కొన్ని కేసుల్లో తేటతెల్లమైంది.
అయితే తాజాగా శ్రీదేవి మరణంపై పలు అనుమానాల్ని వ్యక్తం చేసి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసింది. ఆ రిపోర్టులపై స్పందించిన సుబ్రమణ్యస్వామి పలు ప్రశ్నలు సంధించారు. శ్రీదేవికి ఎవరు మద్యం తాగించారో చెప్పాలని అన్నారు. అన్ని విషయాలు చెబుతున్న దుబాయ్ అధికారులు శ్రీదేవి బసచేసిన హోటల్ సీసీ పుటీజేని బహిర్ఘతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు శ్రీదేవికి మద్యం తాగే అలావాటు లేదని.. బలవంతంగా మద్యం తాగించారా అనే కోణంలో విచారించాలని అన్నారు. శ్రీదేవిది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. మరో వైపు సినీ తారలకు దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.