Begin typing your search above and press return to search.
స్వామి ట్వీట్ బాంబుతో మోడీ ఇమేజ్ మటాషే!
By: Tupaki Desk | 13 Sep 2018 12:13 PM GMTనోరు తెరిస్తే చాలు.. నీతుల మీద నీతులు చెప్పటం.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా వ్యవహరించే ప్రధాని మోడీ సర్కారు డొల్లతనం ఆయన పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి తాజాగా బయట పెట్టారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మాటలతో ఇప్పటికే విలవిలలాడుతున్న బీజేపీకి.. మరింత దిమ్మ తిరిగే షాకిచ్చారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి.
తాజాగా ఆయన చేసిన ట్వీట్ బాంబు మాదిరి బారి.. బీజేపీకి బేజారు పుట్టేలా చేస్తోంది. తాను లండన్ కు జంప్ అయిపోతున్న విషయాన్ని విజయ్ మాల్యా పార్లమెంటులోనే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి చెప్పిన విషయం తిరుగులేని వాస్తవమని ఆయన స్పష్టం చేయటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
మాల్యాపై విడుదలైన లుక్ అవుట్ నోటీసును బలహీనపర్చింది కూడా నిజమని తేల్చిన స్వామి.. తన ట్వీట్ తో పెను సంచలనాన్ని సృష్టించారు. స్వామి చేసిన ట్వీట్ బాంబుతో జైట్లీ మాష్టారికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటంతో పాటు.. ఆయన ఎప్పటికీ కోలుకోలేనంత భారీ పంచ్ ఇచ్చారు.
మాల్యా పరారీ విషయంలో నా దగ్గర ఇప్పుడు రెండు తిరుగులేని వాస్తవాలు ఉన్నాయి. అందులో మొదటిది.. 2015 అక్టోబరు 24న జారీ అయిన లుక్ అవుట్ నోటీసును బలహీనపర్చారు. అడ్డుకోండి అన్న మాటకు సమాచారం చెప్పండి అని మార్చటంతో మాల్యా 54 లగేజీ బ్యాగులతో దర్జాగా వెళ్లేందుకు వీలైంది.రెండోది.. తాను దేశం విడిచి వెళ్లిపోతున్నానని మాల్యా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆర్థికమంత్రి జైట్లీకి చెప్పారు అంటూ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. మాల్యాపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును మార్చిన సమాచారం తన వద్ద ఉందంటూ ఆయన మరో ట్వీట్లో పేర్కొన్నారు. లుక్ అవుట్ నోటీసులో అడ్డుకోండి అన్న పదానికి బదులుగా వెళ్లిపోతే చెప్పండంటూ పదాన్ని మార్చిన వ్యక్తి ఎవరు? దానికి ఎవరి అండదండలు ఉన్నాయంటూ స్వామి అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి.