Begin typing your search above and press return to search.

బీజేపీ ముందున్న తరువాత లక్ష్యం ఆ దేవాలయం?

By:  Tupaki Desk   |   28 Oct 2019 8:20 AM GMT
బీజేపీ ముందున్న తరువాత లక్ష్యం ఆ దేవాలయం?
X
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే gst - డిమానిటైజేషన్ - ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయోధ్య రామ జన్మ భూమి వివాదం కేసులో తీర్పు రామాలయానికి అనుకూలంగా వస్తుందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

కోర్టు తీర్పు వెల్లడించిన వెంటనే .. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి - రెండేళ్ళలో పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఒకవేళ అయోధ్య రామ జన్మ భూమి వివాదంలో కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే రాజ్యాంగంలోని అధికరణ 300ఏ ప్రకారం ఆ భూమిని జాతీయం చేయవచ్చునని తెలిపారు. కానీ , అనుకూలంగా వస్తే తమ తదుపరి లక్ష్యాల్లో కాశీ విశ్వనాథుని దేవాలయం - మధుర శ్రీకృష్ణ దేవాలయం ఉన్నట్టు తెలిపారు.

ఈ విషయం పై అయన మాట్లాడుతూ .. మొఘలుల పరిపాలనా కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న 40 వేల దేవాలయాలను ధ్వంసం చేశారన్నారు. కాశీ విశ్వనాథుని దేవాలయం కోసం జరిగే పోరాటం చాలా సులువుగా ఉంటుందన్నారు. ఇకపోతే అయోధ్య రామ జన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపింది. దీనిపై తీర్పు వచ్చే నెల 17లోగా వెలువడే అవకాశం ఉంది.