Begin typing your search above and press return to search.

స్వామి వర్సెస్ జైట్లీ.. ఈనాటిది కాదు!

By:  Tupaki Desk   |   18 Sep 2016 4:31 AM GMT
స్వామి వర్సెస్ జైట్లీ.. ఈనాటిది కాదు!
X
సంచలనాల విషయంలో తన ప్రత్యేకతను నిత్యం చాటుకునే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తమ పార్టీ నేతపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకీ - సుబ్రహ్మణ్య స్వామికీ మధ్య విభేదాలు పుష్కలంగా ఉన్నాయనే వార్తలు నిత్యం హల్ చల్ చేస్తున్న సమయంలో మరోసారి స్వామి నోటికి పనిచెప్పారు. తాను అరుణ్ జైట్లీ కన్నా మెరుగైన ఆర్ధికమంత్రిని అయ్యుండేవాడినని స్వామీ తాజాగా ప్రకటించారు.

ఇండియా టుడే నిర్వహించిన ఓ డిబేట్‌ లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి... తాను ఆర్ధిక శాస్త్రం చదువుకున్నవాడినని - ఆర్ధికవేత్తనని - అరుణ్ జైట్లీ కేవలం న్యాయవాది మాత్రమేనని మొదలు పెట్టి... తాను ఆర్ధికమంత్రి అయ్యి ఉంటే అరుణ్ జైట్లీ కన్నా మెరుగుగానే చేసేవాడినని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. జైట్లీ బదులుగా మిమ్మల్ని కేంద్ర ఆర్ధికమంత్రిని చేసి ఉంటే ధరలు తగ్గుముఖం పట్టి ఉండేవా? అని డిబేట్ నిర్వహించిన యాంకర్ ప్రశ్నకు స్పందించిన స్వామి... "కచ్చితంగా అవును" అని సమాధానం చెప్పారు. ఇదే సందర్భంలో జైట్లీకి - స్వామికి మధ్య పాకిస్థాన్ - భారత్ మాదిరిగా సంబంధాలు ఎందుకున్నాయని మరో ప్రశ్న లేవనెత్తగా స్వామి తనదైన శైలిలో స్పందించారు. దక్షిణ భారత దేశ బ్రాహ్మణుడికి, ఉత్తర భారత దేశ బ్రాహ్మణుడికి మధ్య అనాదిగా ఉన్న తేడానే అరుణ్ జైట్లీకి తనకూ మధ్య ఉందని చెప్పారు.

కాగా... గతంలో కూడా జైట్లీపై స్వామి సంచలన వ్యాఖ్యలే చేశారు. ఢిల్లీ రాజకీయ వర్గాలలో జైట్లీ కి బిజెపి లో కన్నా కాంగ్రెస్ లోనే ఎక్కువగా స్నేహితులు ఉన్నారని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంభానికి ఆయన సన్నిహితుడని స్వామి వ్యాఖ్యానించినట్లుగా చెబుతుంటారు. అయితే.. స్వామికి - జైట్లీకి మధ్య ఈ స్థాయిలో రచ్చ జరగడానికి కారణం 2014 ఎన్నికలు అని పలువురు విశ్లేషిస్తుంటారు. 2014 ఎన్నికల సమయంలో సుబ్రహ్మణ్య స్వామిని న్యూ ఢిల్లీ నుండి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించాలని నరేంద్ర మోడీ - బిజెపి మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పార్టీ పార్లమెంట్ బోర్డు లో ప్రతిపాదించిన సమయంలో.. సుష్మా స్వరాజ్ - అరుణ్ జైట్లీ కలసి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారని, నాటి నుంచీ జైట్లీ విషయంలో స్వామి సీరియస్ గా రియాక్టవుతారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటుంటారు.