Begin typing your search above and press return to search.
మోడీషాలకు చెక్ పెట్టటం ఎలానో చెప్పిన బీజేపీ నేత!
By: Tupaki Desk | 14 July 2019 5:16 AM GMTసొంత పార్టీ కోసం కిందామీదా పడే నేతల్ని చూస్తాం. తాము చేసే తప్పుల్ని ఒప్పులుగా అభివర్ణించేందుకు చెప్పరాని అబద్ధాల్ని చెప్పేసే వాళ్లు ఎంతోమంది నేతలు కనిపిస్తారు. అందుకు భిన్నమైన వ్యక్తిత్వం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి సొంతం. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో ఊహించటం చాలా కష్టం.
సొంత పార్టీ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేసే సత్తా మాత్రమే కాదు.. తాను ఒకసారి ఒక మాట అన్నాక.. దాని గురించి పార్టీ నేతలు సైతం వేలెత్తి చూపించే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే.. ఆయన్ను టచ్ చేస్తే.. మరింత డ్యామేజీ ఖాయం. స్వతంత్ర భావాలు అత్యధికంగా ఉండే స్వామి.. రాజకీయంగా ఒకరిని అదే పనిగా పొగిడేస్తూ ఉండటానికి అస్సలు ఇష్టపడరు.
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్న ఆయన మాటలు ఒక ఎత్తు అయితే.. మోడీషాలకు సరైన ప్రత్యామ్నాయం ఎలా ఉండాలో చెప్పటమే కాదు.. ఆ ఫార్ములాను వివరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకే దేశం.. ఒకే పార్టీ అంటూ మోడీషాల తీరును తప్పు పట్టారు స్వామి.
గోవా.. కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలు చూశాక.. దేశంలో బీజేపీ ఒక్కటే ఉంటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని తనకు అనిపిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
అందుకే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండేందుకు ఇటలీ వారిని.. వారి సంతానాన్ని పక్కన పెట్టి.. మమతా బెనర్జీ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఆ పార్టీకి నాయకత్వం వహించాలన్నారు. శరద్ పవార్ ను కూడా ఎన్సీపీని కాంగ్రెస్ లో కలిపేయాలన్న ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబును ఎందుకు మర్చిపోయినట్లు..? పూర్వరంగంలో బాబు కూడా కాంగ్రెస్ పార్టీనే కదా? అందరిని గుర్తు పెట్టుకొని.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబును మర్చిపోతారేం స్వామి?