Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్ గురించి షాకింగ్ న్యూస్ లు చెబుతాడట
By: Tupaki Desk | 21 Jun 2016 5:52 AM GMTదేశ రాజకీయాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరు కాస్త భిన్నం. సామాన్యుడినంటూనే అసమాన్యంగా వ్యవహరిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థుల్ని చికాకులు పెట్టించటంలో ఆయన ట్రాక్ రికార్డు బానే ఉందని చెప్పాలి. ప్రత్యర్థుల విషయంలో కరుకుగా వ్యవహరించే ఆయన.. ఏ చిన్న విషయాల్ని వదిలిపెట్టని వైనం తాజా సందర్భాల్లో స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ప్రధాని మోడీకి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి ఆయనెంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటి కేజ్రీవాల్ మీద బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కన్ను పడింది. తాను టార్గెట్ చేసిన వారి అంతు చూసేంత వరకూ నిద్రపోని తత్వం ఉన్న సుబ్రమణ్యస్వామి తర్వాతి టార్గెట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అని చెప్పారు. కాంగ్రెస్ ఏజెంట్ అయిన ఆర్ బీఐ గవర్నర్ రాజన్ వెంట ఇంతకాలం తాను పడ్డానని.. ఇప్పుడా పని పూర్తి అయిన నేపథ్యంలో ఇక తన టార్గెట్ అంతా కేజ్రీవాల్ మీదనే అని చెప్పారు.
అలా చెప్పటంతోనే వదిలిపెట్టకుండా.. శాంపిల్ గా రెండు మాటలుచెప్పుకొచ్చారు. ప్రతిభావంతుడైన విద్యార్థిగా తనను తాను కేజ్రీవాల్ చెప్పుకుంటారని.. మరి.. ఆయన ఐఐటీలో ఎలా చేరారన్న విషయానికి సంబంధించిన రికార్డులు తన వద్ద ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ అధికారి ఎంఎం ఖాన్ హత్యకేసులో తన ప్రమేయం ఉందన్న ఆరోపణల్ని రుజువు చేయాలంటూ బీజేపీ ఢిల్లీ ఈస్ట్ ఎంపీ మహేశ్ ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేయటానికి స్వామి మద్దతు పలికారు. టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు ఏ చిన్న మార్గాన్ని వదలని సుబ్రమణ్య స్వామి దెబ్బకు కేజ్రీవాల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారా? లేక.. స్వామికి తనదైన శైలిలో షాకిస్తారా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.