Begin typing your search above and press return to search.
స్వామికి ‘‘జెడ్’’ ఇచ్చిన పీవీ
By: Tupaki Desk | 20 Dec 2015 4:22 AM GMTనేషనల్ హెరాల్డ్ కేసుతో మరోసారి తెరపైకి వచ్చారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతోపాటు.. మరో ఐదుగురు కాంగ్రెస్ ప్రముఖుల్ని కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనకు జెడ్ భద్రతతో పాటు ఆయనకు ప్రభుత్వ క్వార్టర్ ఇవ్వటంపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. పంజాబ్ మాజీ డీజీపీ గిల్.. యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిట్టా నివాస ప్రాంతంలోనే సుబ్రమణ్యస్వామికి వసతి కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దినిపై కాంగ్రెస్ విమర్శలపై స్వామి స్పందించారు. తనకు జెడ్ ప్లస్ భద్రత ఇప్పుడేం కొత్త కాదని చెప్పిన ఆయన.. కాంగ్రెస్ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలోనే తనకు జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు ఏమీ బీజేపీ నేత కాదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
పీవీ నరసింహరావు హయాంలో తనకు జెడ్ సెక్యూరిటీ ఉండేదని.. తర్వాత కొనసాగినా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పీఏ తన భద్రతకు కోత పెట్టి కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేసిందని చెప్పుకొచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గెలుపు పై నమ్మకం ఉంటే నవ్వుతూ కోర్టుకు వెళ్లేవారని.. ఆ నమ్మకం లేకనే సోనియా పరివారం హడావుడి చేసిందంటూ విరుచుకుపడుతున్నారు. స్వామికి జెడ్ భద్రత ఇచ్చిన వీపీ విషయంపై కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.