Begin typing your search above and press return to search.

‘హెచ్1బీ’ తిరస్కరణలో భారతీయులే టాప్

By:  Tupaki Desk   |   31 July 2018 12:25 PM IST
‘హెచ్1బీ’ తిరస్కరణలో భారతీయులే టాప్
X

అమెరికాలో మనోళ్ల హవా అంతా ఇంతా కాదు.. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవో మన సుందర్ పిచాయ్. ఇక మరో కంప్యూటర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ను సత్యనాదెళ్ల లీడ్ చేస్తున్నారు. భారతీయులు తమ తెలివితేటలతో అమెరికా ఆర్థిక ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా మన భారతీయులపై అమెరికన్ల వివక్ష కొనసాగుతూనే ఉంది.

వారి ఉద్యోగాలు కొల్లగొడుతున్నామన్న కోపమో.. లేక మరేదైనా కావచ్చు కానీ ఇప్పుడు భారతీయులు సమర్పించే హెచ్1బీ వీసా దరఖాస్తులను అమెరికా ఎక్కువగా తిరస్కరిస్తోంది.. ఈ విషయాన్ని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ’ అనే ఎన్టీవో సంస్థ తెలిపింది. అలాగే రిక్వస్ట్ ఆఫ్ ఎవిడెన్స్ ను సమర్పించాలని అమెరికా అధికారులు భారతీయులనే ఎక్కువగా కోరుతున్నారని వెల్లడించింది. అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ వివరాలను విశ్లేషించిన అనంతరం ఈ సంస్థ నిజాలను వెల్లడించింది.

అయితే ఆశ్చర్యకరంగా విదేశీయులకు సంబంధించి హెచ్ 1 బీ వీసాల తిరస్కరణ 40శాతం ఉండగా.. ముఖ్యంగా భారతీయుల వీసాలపై 42శాతం పెరగడం మనపై అమెరికా అధికారుల వైఖరిని వెల్లడిస్తోంది.