Begin typing your search above and press return to search.
51 ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ అలాంటి పరిస్థితి
By: Tupaki Desk | 9 Jun 2020 6:15 AM GMTప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితి. ఊహకు అందని రీతిలో వైరస్ విరుచుకుపడుతున్న వేళ.. పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం పాత ముచ్చటే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలోని 5.34లక్షల మంది విద్యార్థులు రానున్న రోజుల్లో సిత్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొనున్నారు.
టెన్త్ పాస్ ఎప్పుడంటే.. కరోనా ఇయర్ అని చెప్పాల్సిన పరిస్థితి రావటం ఖాయం. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అంటే.. ఒకసారి కాదు రెండు సార్లు అని చెప్పాలి. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు కావటం.. విద్యార్థులు నేరుగా పాస్ కావటం ఇది మూడోసారి. కాకుంటే.. 51 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి నెలకొంది.
ఇంతకీ గడిచిన రెండుసార్లు ఎలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేశారు? అన్న విషయంలోకి వెళితే.. 1951-52 లో నిజాం రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం జరిగింది. వేలాదిమంది రోడ్లపైకి వచ్చారు. దీంతో.. అప్పట్లో స్కూళ్లు..కాలేజీలు నాలుగు నెలల పాటు మూసివేశారు. అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో పరీక్షల్ని నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో.. పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసి.. విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్ చేశారు.
ఇది జరిగిన దాదాపు పదిహేడేళ్ల తర్వాత అంటే 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పట్లో పరిస్థితి తీవ్రంగానే కాదు.. ఉద్రిక్తంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నామమాత్రంగా పరీక్షలు నిర్వహించి అందరిని పాస్ అయినట్లుగా ప్రకటించింది. ఇదే విషయాన్ని.. మాయదారిరోగం ప్రారంభంలో ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. తనకు తెలిసిన వ్యక్తి పదో తరగతి ఫెయిల్ అయ్యాడని.. అందరిని పాస్ చేసే వేళ.. సదరు వ్యక్తి పాస్ కావటమే కాదు.. తర్వాతి కాలంలో ఆయన జడ్జి అయ్యారని.. అప్పుడప్పడు అలాంటి గమ్మత్తులు జరుగుతాయని ఉదహరించారు. ఇప్పుడు అదే కేసీఆర్ హయాంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవటం విశేషం.