Begin typing your search above and press return to search.

రాహుల్ కు పార్లమెంట్ కి వచ్చే అర్హత కూడా లేదు..ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   13 Dec 2019 1:44 PM GMT
రాహుల్ కు  పార్లమెంట్ కి వచ్చే అర్హత కూడా లేదు..ఏమైందంటే  ?
X
జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. అయన గతంలో చాలా సందర్భాలలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అయన మేకిన్ ఇండియా కార్యక్రమం ‘‘రేప్ ఇన్ ఇండియా’’లాగా తయారవుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యల పై లోక్‌ సభలో శుక్రవారం తీవ్ర దుమారం రేగింది. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ సభ్యులు ఆందోళన చెప్పట్టారు.

ఒక ఎంపీ గా కొనసాగుతూ ఇదేనా దేశానికి రాహుల్ ఇచ్చే సందేశం అంటూ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలు ఇండియాలో రేప్‌లకు ఆహ్వానం లాగా ఉందని - అయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని బీజేపీ సభ్యులు డిమాండ్ చేసారు. ఈ రోజు ఉదయం నుండి లోక్ సభ ఇదే వ్యవహారం పై పలుమార్లు వాయిదా పడుతూ గందరగోళం మధ్య ముందుకు సాగింది. ఈ సందర్భంలో రాజ్‌ నాథ్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో నేను గాయపడ్డాను. యావత్ దేశం గాయపడింది. ఆలాంటి మాటలు మాట్లాడేవారు పార్లమెంటులోకి రావచ్చా? ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి...’’ అని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు లేదని - గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమ సభ్యులు సభలో క్షమాపణ చెప్పారని ఆయన గుర్తుచేశారు. కాగా రాజ్‌ నాథ్ మాట్లాడుతున్నప్పుడు రాహుల్ సభలోనే ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని రాహుల్ ఖరాకండిగా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు కూడా నిలబడి వాదనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది.