Begin typing your search above and press return to search.
కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్.. షేక్ అవుతున్న బీజేపీ?
By: Tupaki Desk | 4 Nov 2022 9:36 AM GMTఒకే దెబ్బకు చాలా పిట్టలన్నట్టు కేసీఆర్ ఇప్పుడు బీజేపీని ఒకే ఒక సంచలన ప్రెస్ మీట్ తో డిఫెన్స్ లో పెట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆధారాలపై కక్కలేక మింగలేక బీజేపీ తటపటాయిస్తోంది. కవర్ చేసుకోవడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో అమిత్ షా, మోడీల పేర్లు బయటకు రావడంతో ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి. కేసీఆర్ ను తక్కువగా అంచనావేసిన బీజేపీకి ఈ పరిణామం ఇప్పుడు మింగుడుపడని వ్యవహారంగా మారింది. గుజరాత్ ఎన్నికల వేళ బయటపడ్డ ఈ వీడియోలు బీజేపీని షేక్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆగమేఘాలపై నేతల స్పందన చూస్తే అదే అర్థమవుతోంది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఘటనను వీడియోలతో సహా బయటపెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీని డిఫెన్స్ లో పడేశఆడు. కేసీఆర్ ఆరోపణలపై దేశమంతా చర్చ సాగుతున్న వేళ బీజేపీ హైకమాండ్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
గత రాత్రి ప్రెస్ మీట్ ముగిసిన తరువాత గుజరాత్‌లో ఉన్న టి-బిజెపి ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ వెంటనే ఢిల్లీకి వెళ్లి టి-బిజెపి నాయకులతో మాట్లాడినట్టు తెలిసింది. కేసీఆర్ ప్రెస్ మీట్ వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌లతో తరుణ్ చర్చించినట్లు సమాచారం.
అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ పేర్లను ప్రస్తావించిన వీడియో ముఖ్యంగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మరింత నష్టం కలిగించవచ్చని బీజేపీ హైకమాండ్ ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. తరుణ్ చుగ్, టీ-బీజేపీ నేతల మధ్య కొంత సీరియస్ చర్చ జరిగినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది..
తదనుగుణంగా బిజెపి అగ్రనేతలపై కెసిఆర్ ఆరోపణలకు టి-బిజెపి నాయకులు కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారు. వారు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా సమగ్ర విచారణకు డిమాండ్ చేసే అవకాశం ఉంది. టీ బీజేపీ నాయకులు విచారణపై సవాలు విసురడానికి రెడీ అయ్యారట.. అయితే కేసీఆర్ టీఆర్ఎస్ కొనుగోళ్ల వీడియోను భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ , సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు పంపడం ద్వారా బిజెపికి చెక్‌మేట్ పెట్టేశాడని అంటున్నారు.
ఈ దృక్కోణంలో బిజెపి చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోంది. అన్ని అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. బీజేపీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. నేతలు ఎలా బదులిస్తారో చూడాలి. మరోవైపు టీ-బీజేపీ నేతల వ్యాఖ్యల ఆధారంగా కేసీఆర్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టాలని భావిస్తున్నారని అది రాజకీయ వేడిని పెంచుతుందని వినికిడి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.