Begin typing your search above and press return to search.
ఆ టెక్ దిగ్గజ సతీమణికి సంబంధించి షాకింగ్ నిజం
By: Tupaki Desk | 31 July 2017 4:47 AM GMTటన్నుల టన్నుల పేరు ప్రఖ్యాతులు. ఇక..డబ్బు గురించి చెప్పాల్సిన అవసరమే లేని మహిళగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి కమ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధా మూర్తికి సంబంధించిన ఒక షాకింగ్ నిజం బయటకు వచ్చింది. సాదాసీదా మహిళగా కనిపించే ఈ మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ లో ఎవరూ ఊహించలేని ఒక విషయం ఉందని చెప్పాలి.
తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఎవరూ నమ్మలేని ఒక నిజాన్ని చెప్పారు. అదేమంటే.. వేలాది కోట్ల ఆస్తికి సొంతదారైన సుధాకృష్ణమూర్తి గడిచిన 21 సంవత్సరాలుగా ఒక్క చీర కూడా కొనలేదట. అలా అని ఆమె చీరలు కట్టుకోరా? అంటే.. ఆమె ధరించేదే చీర. అలాంటిది ఒక్క చీర కూడా ఎలా కొనకుండా ఉన్నారు? అన్న సందేహానికి సుధాకృష్ణమూర్తి చెప్పిన ఆసక్తికరమైన సమాధానం ఏమిటంటే..
కాశీ యాత్రలో తమకు ఇష్టమైన దాన్ని విశ్వేశ్వరుడికి ఆర్పించటం చాలామంది చేసేదే. దీంతో.. తనకెంతో ఇష్టమైన చీరల షాపింగ్ ను కాశీలో వదిలేసినట్లుగా ఆమె వెల్లడించారు. మహిళలకు చీరలకు మధ్యనున్న లింకును ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది తనకెంతో ఇష్టమైన చీరను కాశీ పవిత్ర స్నానం సందర్భంగా వదిలేసినట్లుగా వెల్లడించారు. ఇప్పుడు కేవలం చాలా అత్యవసరమైన వస్తువులను మాత్రమే కొంటున్నానని.. తాను చాలా సంతోషంగా ఉన్నట్లుగా ఆమె పేర్కొన్నారు. వేల కోట్లు ఉన్నప్పటికీ.. సాదాసీదాగా బతికేయాలన్న నిర్ణయం నిజంగా గ్రేట్ కదూ?