Begin typing your search above and press return to search.
భారత టెకీకి అమెరికా పౌరసత్వం ఇచ్చిన ట్రంప్
By: Tupaki Desk | 26 Aug 2020 5:37 PM GMTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల వారిని అమెరికా నుంచి వెళ్లగొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీసాలు కట్ చేసి.. గ్రీన్ కార్డులు కోత వేసి ఇలా తమ దేశంలో బతకవద్దని హుకూం జారీ చేస్తున్నారు. అయితే అదే ట్రంప్ ఓ భారతీయ టెకీకి స్వయంగా అమెరికా పౌరసత్వం ఇవ్వడం విశేషంగా మారింది.
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విదేశీ ఓటర్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి కేంద్రీకరించారు. ఐదు దేశాలకు చెందిన పౌరులకు అమెరికా పౌరసత్వాన్ని అందజేసే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా మంగళవారం సాయంత్రం నిర్వహించారు.
భారత్ కు చెందిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సుధాసుందరి నారాయణన్ కూడా తాజాగా అమెరికా పౌరసత్వాన్ని ట్రంప్ చేతుల మీదుగా స్వయంగా అందుకోవడం విశేషం.
భారత్, బొలివీయా, లెబనాన్, సుడాన్, ఘనా దేశాలకు చెందిన ఐదుగురు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు.
13 ఏళ్ల కింద అమెరికాకు వచ్చిన సుధా నారాయణన్ వృత్తిపరంగా అద్భుత విజయాలు సాధించింది.
అమెరికా రంగు, మతాన్ని చూడబోదని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదని ట్రంప్ అన్నారు.