Begin typing your search above and press return to search.
బ్రిటన్‌పై ప్రేమ.. భారత్‌పై అక్కసు.. యూకే మంత్రి నోటి దురుసు!
By: Tupaki Desk | 15 Oct 2022 12:30 AM GMTఏ చిన్న అవకాశం చిన్న అవకాశం చిక్కినా.. భారతదేశ నాయకులు నోరు పారేసుకుంటారు.. ఆచితూచి అస్సలు మాట్లాడరు.. వారితో ఇబ్బంది! అనే పేరు ప్రపంచ దేశాల్లో మన నేతల గురించి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. గతంలో ఇది పెద్ద చిక్కులు తెచ్చి పెట్టింది కూడా. దీంతో కేంద్రంలో అనేక మార్పులు జరిగిన పరిస్థితి మనకు ఉంది. అయితే.. బ్రిటన్, అమెరికా వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు.. మాత్రం తమ తమ పరిధిలు దాటకుండా.. వ్యాఖ్యానిస్తాయి. కానీ, ఇప్పుడు అదే బ్రిటన్‌కు చెందిన ఓ మంత్రి.. నోరు పారేసుకుంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది.
భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యం(ఫ్రీ ట్రేడ్) ప్రమాదకరమని.. దీనివల్ల వలసలు పెరుగుతాయని.. వ్యాఖ్యానించింది. అంతేకాదు.. వీసా గడువు తీరిపోయిన తర్వాత.. బ్రిటన్‌లో ఉండిపోతున్న ఇతర దేశాల పౌరులతో పోలిస్తే.. భారత్ ప్రజలే ఎక్కువగా ఉంటున్నారని కూడా.. నిప్పులు చెరిగింది. ఈ పరిణామం.. ఇరు దేశాల మధ్య చిచ్చు రేపింది. అంతేకాదు.. బారత్ తొలిసారి బ్రిటన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే వరకు కూడా వెళ్లింది. మరి .. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది? ఎందుకు మాట్లాడింది? చూద్దాం..
ఆమె.. బ్రిటన్ హోం శాఖ మంత్రి సుయేలా బ్రేవర్మన్. ఈమె తల్లిదండ్రుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. తండ్రి క్రిస్టీ ఫెర్నాండో గోవా నుంచి కెన్యా వెళ్లి.. అక్కడి నుంచి యూకేలో స్థిరపడ్డారు. ఇక ఆమె తల్లి ఉమ తమిళనాడు నుంచి మారిషస్‌కు వెళ్లి.. అక్కడి నుంచి యూకే చేరుకొని నేషనల్ హెల్త్‌సర్వీస్‌లో నర్స్‌గా పనిచేశారు. ఇక, ఇప్పుడు నోరు పారేసుకున్న మంత్రి వర్యులు.. బ్రేవర్మన్ న్యాయవిద్య చదివారు. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌కు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినవారిలో ఆమె కూడా ఒకరు.
అపరిమిత సాగిలపాటు!!
బ్రేవర్మన్ బ్రిటిష్ రాచరికంపై విపరీతమైన భక్తిని ప్రదర్శిస్తారనే పేరుంది. ‘బ్రిటన్ చరిత్రలో చేసిన చర్యలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. కెన్యా, మారిషస్ వంటి దేశాల్లో న్యాయవ్యవస్థ, సైన్యం, పౌరసేవలు, మౌలిక వసతులు బ్రిటిష్ రాచరికపు చలువే అని ఆమె సెలవిచ్చారు. బ్రిటిష్ సామ్రజ్యంపై ప్రేమతోనే తన తల్లిదండ్రులు వలస వచ్చారని చెప్పారు. బ్రిటన్‌కు అక్రమంగా వలస వచ్చేవారిని ఆఫ్రికా దేశమైన రవాండాకు తరలించడం తన కల అని గతంలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారత్ గురించి.. ఏమందంటే..
బ్రేవర్మన్ ఇటీవల ది స్పెక్టేటర్ పత్రికతో మాట్లాడుతూ.. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య(ఫ్రీ ట్రేడ్) ఒప్పందం చేసుకొంటే వలసలు భారీగా పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వీసా కాలపరిమితి ముగిసినా చాలా మంది భారతీయులు ఇంకా బ్రిటన్‌లోనే ఉండిపోతున్నారని పేర్కొన్నారు. అసలు వీసా కాలపరిమితి మించి బ్రిటన్‌లో ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులు అని వెల్లడించారు. భారత్‌తో ఓపెన్ బోర్డర్ మైగ్రేషన్ పాలసీపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ కోసం ఓటు వేసిన ప్రజలు దీనిని కోరుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌తో చేసుకొన్న ఒప్పందం వల్ల పెద్ద ప్రయోజనం లేదని ఆమె విమర్శించారు.
భారత్ నిప్పులు చెరిగింది!
బ్రిటన్ హోం మంత్రి వ్యాఖ్యలు భారత్‌ను షాక్‌కు గురిచేశాయి. ఒక రకంగా అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్‌ను దెబ్బతీసేవిగా ఉన్నాయి. దీంతో దీపావళి సమయంలో జరగాల్సిన భారత ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కూడా కీలక చర్యలు చేపట్టింది. భారత్ పర్యటన నిమిత్తం వీసాల కోసం దరఖాస్తు చేసుకొనే బ్రిటన్ వాసులు స్వయంగా వీసా కేంద్రాలకు హాజరుకావాలని పేర్కొంది. ఏజెంట్లు రాకూడదని తేల్చిచెప్పింది. బ్రేవర్మన్ వ్యాఖ్యలకు దీనిని ప్రతిచర్యగా భావిస్తున్నారు.
ఆమె వ్యాఖ్యలపై ఏమీ చేయలేరట!!
ప్రధాని లిజ్‌ట్రస్ ప్రతినిధి... బ్రేవర్మన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవి బ్రిటన్ అధికారిక విధానాలు కావని పేర్కొన్నారు. దీపావళి నాటికి తాము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లేవర్లీ మాట్లాడుతూ.. భారత్‌తో బలమైన వ్యాపార సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత వలసదారులపై బ్రేవర్మన్ కామెంట్లపై క్లేవర్లీ స్పందిస్తూ.. ‘‘మేము భారత్‌తో ఇంకా బలమైన వ్యాపార భాగస్వామ్యం కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. కానీ, ఆ మంత్రిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకునే యోచన లేదని పరోక్షంగా చెప్పేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.