Begin typing your search above and press return to search.
జగన్ వద్దకు సుగాలి ప్రీతి కేసు..దోషులకు శిక్ష ఖాయమే
By: Tupaki Desk | 18 Feb 2020 4:31 PM GMTవైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జరిపిన కర్నూలు పర్యటనలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడేళ్ల నాడు టీడీపీ జమానాలో టీడీపీ నేతకు చెందినదిగా భావిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ప్రీతి ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం చెబుతుంటే.. కళాశాల యజమాని కుమారులు ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తమ కుమార్తె హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు మూడేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కర్నూలు వచ్చిన జగన్ ను ప్రీతి పేరెంట్స్ కలిశారు. వారితో మాట్లాడిన జగన్... దోషులకు శిక్ష పడేలా చేస్తామంటూ గట్టి భరోసానే ఇచ్చారు. జగన్ భరోసా ఇచ్చిన వైనం చూస్తుంటే... ప్రీతి మరణానికి కారకులైన వారికి త్వరలోనే శిక్ష పడటం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కర్నూలు పర్యటనలో భాగంగా కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్... తనను కలిసేందుకు ప్రీతి పేరెంట్స్ వచ్చిన విషయాన్ని తెలుసుకుని వేదిక దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిచ్చిన వినతి పత్రాన్ని తీసుకున్నారు. జరిగిన దారుణంపై వారు చెప్పిన విషయాన్నంతా సావదానంగా విన్నారు. అంతేకాకుండా ప్రీతి మరణానికి కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో మీరెలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని జగన్ వారికి గట్టి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా అక్కడికక్కడే కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్పను పిలిపించి... ప్రీతి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? అన్న వివరాలను తెలుసుకున్నారు. ఈ కేసుపై మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా ఎస్పీకి జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా... కేసు డైరీని తన కార్యాలయానికి పంపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే... ఈ కేసులో దోషులకు కఠిన దండన విధించాల్సిందేనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే ఈ నెల 12న పవన్ కర్నూలులో పర్యటించారు కూడా. అయితే పవన్ పర్యటనకు ముందే... ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా కర్నూలు జిల్లా ఎస్పీ ప్రకటించారు. మొత్తంగా 2017లో జరిగిన ప్రీతి హత్యాచారంపై టీడీపీ హయాంలో దర్యాప్తు నత్తనడకన సాగగా... జగన్ సీఎం అయ్యాక కేసు దర్యాప్తులో ఓ మోస్తరు వేగం పుంజుకుందనే చెప్పాలి. తాజాగా ప్రీతి తల్లిదండ్రులు నేరుగా జగన్ ను కలవడం, దోషులను వదిలేది లేదంటూ జగన్ వారికి భరోసా ఇవ్వడం చూస్తుంటే... ప్రీతి హంతకులకు త్వరలోనే కఠిన దండన అమలు కావడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ కొత్తగా దిశ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ కేసుపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయమేనని, దోషులు తప్పించుకునే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.