Begin typing your search above and press return to search.

ఈ దరిద్రపుగొట్టు షుగర్ బేబీస్ ఎమిటంటే..?

By:  Tupaki Desk   |   3 Nov 2015 10:30 PM GMT
ఈ దరిద్రపుగొట్టు షుగర్ బేబీస్ ఎమిటంటే..?
X
ఉన్నత జీవితం కోసం.. అత్యుత్తుమ కెరీర్ కోసం విదేశీ బాట పట్టే విద్యార్థులు ఎందరో. అయితే.. ఇలాంటి వారి మనసులోని కోరికల్ని తెలుసుకొని.. ఎర వేసి తమ పని పూర్తి చేసుకునే వారు బ్రిటన్ లో ఈ మధ్య పెరిగిపోయినట్లు చెబుతున్నారు. విదేశీ విద్య కోసం బ్రిటన్ కు వచ్చే అమ్మాయిలకు వల వేయటం.. వారి అవసరాల్ని గుర్తించి.. వారికుంటే ఇబ్బందుల్ని తమ విలాసాల కోసం వాడుకునే వైనం ఈ మధ్యకాలం బాగా పెరుగుతోందట.

ఈ మధ్య కాలంలో బ్రిటన్ లో పెరిగి షుగర్ బేబీస్ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చగా మారిందని చెబుతున్నారు. బ్రిటన్ లో ట్రెండ్ గా మారిన ఈ షుగర్ బేబీస్ వ్యవహారంలోకి వెళితే.. విదేశీ విద్యను అభ్యసించటానికి దేశానికి వచ్చే పడుచు పిల్లల మీద అక్కడి ముసలాళ్ల కన్ను పడుతోందట. చదువు కోసం వచ్చే వారికి ఖర్చులు చాలానే ఉంటాయి. ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా వారు ఇంటి నుంచి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితి.

ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి.. వారిని ముగ్గులోకి దించే ప్రయత్నాలు ఈ మధ్యన జోరందుకున్నాయి. షుగర్ బేబీస్ పేరుతో వ్యవహరిస్తూ.. డబ్బు కోసం ముసలాళ్లతో డేటింగ్ కు సిద్ధపడటమే మొత్తంగా కాన్సెప్ట్ అని చెబుతున్నారు. డబ్బుల అవసరంతో ఇలాంటి చాలామంది కాలేజీ అమ్మాయిలు చేస్తున్నారట.

ఇలాంటి వారిని ఆకర్షించేందుకు వివిధ వెబ్ సైట్లు సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నాయట. అమ్మాయిల డేటింగ్ కావాలని కోరుకునే వారు.. ప్రొఫైల్ పిక్చర్స్ చూసి.. నచ్చితే వారితో డేటింగ్ షురూ అవుతుందట. ఇలా డేటింగ్ మొదలెట్టి.. నెలకు రూ.లక్ష వరకూ ఇస్తుంటారట. ఈ వైఖరిపై పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తమ భవిష్యత్తు కోసం ఇలాంటివి తప్పటం లేదంటూ తాము చేసిన పనిని మరికొందరు సమర్థించుకుంటున్నారట. అయినా.. ఎంత డబ్బు అవసరమైతే మాత్రం ఇలాంటి తిప్పలు అవసరమా..?