Begin typing your search above and press return to search.
ప్రభుత్వ విప్ కుమారుడి ఆత్మహత్యా యత్నం.. కారణం అదేనా?
By: Tupaki Desk | 4 July 2021 11:45 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేకెత్తించింది. దీనికి వ్యాపారంలో వెలుగు చూసిన లావాదేవీలే కారణంగా ప్రచారం సాగుతోంది. స్థానికులు, ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
కర్నాటక ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి కుమారుడు శ్రవణ్ కుమార్ తో ప్రవీణ్ కుమార్ రెడ్డి కార్ షోరూమ్ బిజినెస్ ప్రారంభించారు. అయితే.. లావాదేవీల విషయంలో తేడాలు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. లెక్కలు తేల్చుకోవాలని కర్నాటక ఎమ్మెల్యే కుమారులు పిలుస్తున్నా.. ప్రవీణ్ కుమార్ వాళ్లను కలవట్లేదట.
దీంతో.. కర్నాటక ఎమ్మెల్యే సోమశేఖర రెడ్డి జోక్యం చేసుకున్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం తన కుమారులతో కలిసి ఆయనే స్వయంగా బళ్లారిలో ఉన్న కార్ల షోరూమ్ వద్దకు వెళ్లారు. కానీ.. అక్కడ ప్రవీణ్ లేకపోవడంతో.. ఫోన్ చేశారట.
అనంతపురం నుంచి కారులో బయలుదేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి షోరూం వద్దకు చేరుకున్నారు. దీంతో.. లావాదేవీల లెక్కలు చూపించాలని నిలదీశారట. ఈ సందర్భంగా ప్రవీణ్ ను ఎమ్మెల్యే సోమశేఖర రెడ్డి తీవ్రంగానే మందలించినట్టుగా తెలుస్తోంది. దీంతో.. మనస్థాపానికి గురైన ప్రవీణ్.. పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు.
షోరూమ్ లో ఉన్న సిబ్బంది, ఉద్యోగులు వెంటనే స్పందించి, అడ్డుకున్నారు. ఆ తర్వాత బళ్లారిలోని ఓ ఆసుపత్రికి అతన్ని తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్టు సమాచారం. మరి, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.