Begin typing your search above and press return to search.

న్యూయార్క్ మాన‌వ బాంబు స‌రిగా పేలి ఉంటే..?

By:  Tupaki Desk   |   12 Dec 2017 4:44 AM GMT
న్యూయార్క్ మాన‌వ బాంబు స‌రిగా పేలి ఉంటే..?
X
భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం రాత్రి.. అమెరికా కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన న్యూయార్క్ మాన‌వ బాంబు పేలుడు అమెరికాకు షాకింగ్ గా మారితే.. ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. అమెరికా ఆర్థిక రాజ‌ధానిగా అభివ‌ర్ణించే న్యూయార్క్ న‌గ‌రంలోని మాన్ హ‌ట్ట‌న్ ద‌గ్గ‌ర సోమ‌వారం ఉద‌యం 7.45 గంట‌ల వేళ మాన‌వ బాంబు పేలుడు చోటు చేసుకుంది.

42వ వీధిలోని ఎనిమిదో అవెన్యూలో పోర్ట్ అథారిటీ బ‌స్ టెర్మిన‌ల్ ను పేలుడు కేంద్రంగా పోలీసులు గుర్తించారు. ఈ టెర్మిన‌ల్‌ ను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ పేలుడులో మాన‌వ బాంబు గాయ‌ప‌డ‌గా.. మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. కావాల‌నే త‌న‌ను తాను స‌రిగ్గా పేల్చుకోకుండా జాగ్ర‌త్త ప‌డ్డారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

మ‌రికొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్న క్రిస్మ‌స్ కు ముందుగా జ‌రిగిన ఈ బాంబు పేలుళ్లు ఒక వార్నింగ్ గా భావిస్తున్నారు.

స్లీపింగ్ సెల్స్ ను ఒక్కసారి అలెర్ట్ చేసి సింగిల్ ఊల్ఫ్స్ దాడుల‌కు ఉసిగొల్పారా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మాన‌వ‌బాంబు పేల్చ‌టంలో విప‌ల‌మైన‌ట్లుగా అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ స‌రిగ్గా కానీ బాంబు పేలుడు సంభ‌వించి ఉంటే ఘోర‌మైన విషాదాన్ని చూసేవాళ్ల‌మ‌న్న అభిప్రాయం అమెరిక‌న్ అధికారులు వ్య‌క్తం చేస్తున్నారు. మాన‌వ బాంబు పేలుడుకు పాల్పడిన వ్య‌క్తిని బంగ్లాదేశీయునిగా గుర్తించారు. గ‌డిచిన ఏడేళ్లుగా అమెరికాలోనే ఉన్న అత‌ని పేరు అఖాయెద్‌ ఉల్లా అని చెబుతున్నారు. ఆత్మాహుతి దాడికి ప్ర‌య‌త్నించిన వ్య‌క్తి ఐసిస్ అనుకూలుడిగా న్యూయార్క్ పోలీసులు వెల్ల‌డించారు