Begin typing your search above and press return to search.
ఫైవ్ స్టార్ హోటల్లో బాంబును అలా పేల్చేశాడట!
By: Tupaki Desk | 22 April 2019 4:14 AM GMTఎనిమిది ప్రాంతాల్లో ఆత్మాహుతి దళాల బాంబుపేలుళ్లతో శ్రీలంక రాజధాని నగరం కొలంబో చిగురుటాకులా వణికింది. ఈస్టర్ పండుగ నాడు మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. పండుగ వేళ.. హుషారుగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ.. అత్యంత వ్యూహాత్మకంగా..రాక్షసత్వంగా వ్యవహరించిన ఉన్మాదుల కారణంగా 215 మంది మృత్యువాత పడిన వైనం కంట కన్నీరు కార్చేలా చేస్తోంది.
మొత్తం ఎనిమిది చోట్ల చోటు చేసుకున్న బాంబుపేలుళ్లలో మూడు ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా ఆత్మాహుతి దాడులు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ఫైర్ స్టార్ హోటళ్లలో ఆత్మాహుతి దాడులు ఎలా జరిగాయన్న దానికి సమాధానంగా కొలంబోలో ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ గా.. విదేశీయులు ఎక్కువగా ఉండే ద సినమన్ గ్రాండ్ హోటల్ ఎపిసోడ్ ఒక నిదర్శనంగా చెప్పాలి.
ఉదయం ఎనిమిదిన్న ప్రాంతంలో సినమన్ గ్రాండ్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేయటానికి హోటల్లో గదులు తీసుకున్న అతిధులు వచ్చారు. ఆదివారం కావటంతో జనం తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో.. బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు పెద్ద క్యూ కట్టారు. తినేందుకు వచ్చే వారిని హోటల్ మేనేజర్ వినయంగా ఆహ్వానిస్తున్నారు.
అందరిలానే మహమ్మద్ అజాం మహమ్మద్ అనే వ్యక్తి క్యూలో ఓపికగా నిలుచున్నారు. భుజాన బ్యాగ్ తగిలించుకొని చేతిలో ప్లేట్ పట్టుకొని నిలుచున్నాడు. క్యూలైన్ లో మధ్యకు వచ్చానని నిర్దారించుకున్న అతగాడు.. ఒక్కసారిగా తనతో ఉంచిన బాంబును పేల్చారు. పెద్ద శబ్ధంతో చోటు చేసుకున్న మారణహోమం ఏమిటో అర్థమయ్యేసరికి పెద్ద ఎత్తున ప్రాణాలు పోయాయి. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అప్పటివరకూ చిన్నారుల ఆటలతో హడావుడిగా కనిపించిన హోటల్ ప్రాంగణం.. బాధితుల ఆర్తనాదాలతో మార్మోగిపోయేలా చేసింది. ఇంత రాక్షసత్వం.. ఆరాచకం మానవాళికే ముప్పుగా చెప్పక తప్పదు.