Begin typing your search above and press return to search.
నైట్రోజన్ గ్యాస్ పైపునోట్లో పెట్టుకొని సూసైడ్.. హైదరాబాద్ లో దారుణం
By: Tupaki Desk | 2 March 2021 1:30 PM GMTహైదరాబాద్ మహానగరంలో నిత్యం ఆత్మహత్యలు నమోదవుతుంటాయి. రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఆత్మహత్య షాకింగ్ గా మారింది. మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఒక యువకుడు మరణించిన తీరు ఇప్పుడు చర్చగా మారింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణం వివరాలుఇలా ఉన్నాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాతికేళ్ల శివరామవర్మ బీటెక్ పూర్తి చేశాడు.
గడిచిన కొంతకాలంగా తనను ఎవరో వెంటాడుతున్నట్లుగా ఆందోళన చెందేవాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేవాడు. దీంతో.. అతడి కుటుంబ సభ్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. గత నెల 26న స్నేహితుడ్ని కలిసేందుకు హైదరాబాద్ కు వచ్చిన అతడు.. మాసబ్ ట్యాంక్ లోని హైదరాబాద్ హైట్స్ హోటల్ లో రూం రెంట్ కు తీసుకున్నాడు. సోమవారం ఉదయం తలుపు తెరవకపోవటంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సాయంత్రం మూడు గంటలకు పోలీసులు వచ్చి రూం తలుపులు తెరిచి చూడగా.. శివరామవర్మ అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతడి శరీరం మొత్తం ఉబ్బిపోయినట్లుగా గుర్తించారు. రూంలోకి దిగిన తర్వాతి రోజే లంగర్ హౌస్ లో ఏసీ కోసం ఐదు కేజీల నైట్రోజన్ సిలిండర్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. హోటల్ కు వచ్చిన తర్వాత ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని పైప్ కనెక్టు చేసుకొని సిలిండర్ ఆన్ చేసుకోవటంతో మరణించినట్లుగా భావిస్తున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.