Begin typing your search above and press return to search.

కరోనా సోకిందనే భయంతో సూసైడ్ !

By:  Tupaki Desk   |   19 March 2020 6:15 AM GMT
కరోనా సోకిందనే భయంతో సూసైడ్ !
X
కరోనా ..కరోనా ...కరోనా ..ఈ వైరస్ సోకిన వారి పరిస్థితి ఒకలా ఉంటే , ఈ వైరస్ సోకుతుందేమో అని బయపడేవారి పరిస్థితి మరోలా ఉంది. కరోనా నివారణకి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుండటం తో అందరిలో ఆందోళన మొదలైంది. కరోనా ..వినడానికి మూడు అక్షరాలే అయినా కూడా ..దాని దెబ్బకి అందరూ అబ్బా అంటున్నారు. భారత్ లో కూడా ఈ వైరస్ ప్రభావం వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,03,841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8231 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 151 కి చేరింది. అలాగే కరోనా కారణంగా ఇప్పటికే ఇండియా లో ముగ్గురు చనిపోయారు.

కాగా , కరోనా అనుమానం తో ఒక యువకుడు తాజాగా ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కరోనా అనుమానం తో ఆత్మహత్యకి పాల్పడిన ఆ యువకుడు ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. దీనితో తన్వీర్‌ ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద సిబ్బంది కరోనా స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. అతడిని కరోనా అనుమానితునిగా భావించి , ఎయిర్ పోర్ట్ నుండి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి కరోనా కి చికిత్స అందించడం మొదలుపెట్టారు.

అయితే, కరోనా సోకిందన్న కారణం తో ఆ యువకుడు క్షణికావేశంలో ఎవరూ ఊహంచని విధంగా ఆసుపత్రి భవనం నుంచి దూకి తన్వీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని 35 ఏళ్ల తన్వీర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడు పంజాబ్‌ లోని షహీద్‌ భగత్‌సింగ్ నగర్ జిల్లాలోని సియానా గ్రామానికి వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తన్వీర్ సింగ్ మృతదేహాన్ని ముట్టుకోవద్దని సీనియర్ వైద్యులు పోలీసులకు తెలిపారు. ముందుగా ఆ మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లు భావిస్తున్నారు.