Begin typing your search above and press return to search.
ప్రేమ అన్నది.. పెళ్లి వద్దంది.. నా చావు తర్వాత ఖర్చు వసూలు చేయండి
By: Tupaki Desk | 1 Jun 2022 7:30 AM GMTప్రేమ.. పెళ్లి అంత ఈజీ కాదు. దానికి జరగాల్సిన కసరత్తు ఎంతో. అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేయటం జమానా నుంచి ఉంది. మారిన కాలానికి తగ్గట్లు.. ప్రేమ పేరుతో అబ్బాయిలకు షాకిచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది.
ప్రేమించినట్లుగా చెప్పి అదే పనిగా తమ చుట్టూ తిరిగేలా చేసి.. చివరకు హ్యాండిచ్చేయటంతో ఎంతోమంది మగాళ్లు ఆవేదన చెందే పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైతే.. తట్టుకోలేని ఒక మగాడు సూసైడ్ చేసుకున్నాడు.
అదే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి విషయానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించి.. ఆ పని పూర్తి చేయాలంటూ తన చివరి కోరికగా కోరారు. ఈ భిన్నమైన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
కర్ణాటక లోని చిక్కమగళూరు జిల్లా శంకరపురకు చెందిన 31 ఏళ్ల చేతన్ తాజాగా సూసైడ్ చేసుకున్నాడు. దీనికి కారణం తాను తొమ్మిదేళ్లుగా ప్రేమించిన అమ్మాయే కారణమని తేల్చాడు. తామిద్దరం తరచూ కలిసే వాళ్లమని.. ఆమె సరదాలు.. సంతోషాల్ని తీర్చటం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయాడు. ఇంత ఖర్చు చేసిన తర్వాత అయినా ఆమెను పెళ్లాడాలన్న కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది.
సరకు రవాణా వాహనాన్ని నడిపే డ్రైవర్ ఉద్యోగం చేసే చేతన్ ను పెళ్లాడేందుకు సదరు అమ్మాయి నో చెప్పింది.దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చేతన్ తాజాగా ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. అయితే.. అతని డెడ్ బాడీ దగ్గర ఒక పేపర్ లభించింది.
అందులో తన ప్రేయసి సరదాల కోసం రూ.4.5లక్షల మొత్తాన్ని ఖర్చు చేశానని.. ఆమె నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి తన కుటుంబానికి ఇవ్వాలని కోరాడు. ఈలేఖను స్వాధీనం చేసుకున్న పోలసులు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.