Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ : మందు దొరకలేదని ఆత్మహత్య చేసుకున్నాడట !
By: Tupaki Desk | 28 March 2020 4:30 AM GMTకరోనా వైరస్ ..దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో , దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో దేశంలోని ప్రజలకి అన్ని రకాల వస్తువులు దొరకడం లేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ..ప్రజల అవసరాల కోసం కిరాణా దుకాణాలు, ఫుడ్‌కు సంబంధించిన షాపింగ్ మాల్స్‌ను తెరిచేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మద్యానికి బానిసగా మారిన ఒక వ్యక్తి ..లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరకక పోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. మద్యం దొరక్కపోవడంతో..పిచ్చి పట్టినట్టు అయ్యి ..అక్కడే ఉన్న ఒక చెట్టుకి ఉరేసుకుని ఈ అఘాయిత్యానకి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని తువ్వనూర్‌లో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే , ప్రజలని కరోనా భారీ నుండి కాపాడటానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ఈ నేపథ్యంలో మందుబాబులు మందు దొరకటడం లేదు అని ఆత్మహత్య చేసుకోవడం విడ్డురంగా ఉంది.
ఈ వ్యవహారం ఇలా ఉంటే, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి.. ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్నట్లు తన బంధువు ఒకరు తెలిపారు. మృతుడి తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితయ్యారని, ఇక అతని తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుందని, ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, ఎక్కడ కూడా ఉద్యోగం రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నాడు.