Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే అహంకారానికి తగిన శాస్తి
By: Tupaki Desk | 26 Oct 2022 11:19 AM GMTమునుగోడు ప్రచారంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన పని వివాదాస్పదమైంది. పద్మశాలీయులు పవిత్రంగా నేచే మగ్గంపై కాలు పెట్టి అహంకారాన్ని ప్రదర్శించిన ఎమ్మెల్యేపై ఆ సంఘం వారు ఆందోళనలతో అట్టుడికిపోయేలా చేశారు. మునుగోడులో ఈ దెబ్బకు పద్మశాలీల ఓట్లు అన్నీ టీఆర్ఎస్ కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.ఎమ్మెల్యే చేసిన పనికి గులాబీ పార్టీకి బొక్కపడింది.
తాజాగా పోచంమైదాన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేంద్ర దిష్టబొమ్మను పద్మశాలీయులు దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తతలకు దారితీసింది.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేంద్ర పద్మశాలీలను కించపరిచాడని.. మగ్గంపై కాలుపెట్టి దుర్మార్గంగా ప్రవర్తించాని పద్మశాలీయులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు అంత అహంకారం ఎందుకని దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు.
ఇంతకీ ఎమ్మెల్యే చేసిన తప్పు ఏదంటే.. మునుగోడులోని పోచంమైదాన్ లో ప్రచారానికి వెళ్లి ఓ నేతన్న మగ్గంపై పనిచేస్తుండగా ఆ మగ్గంపై కాలు పెట్టాడు. పద్మశాలీయులు దైవంగా భావించే మగ్గంపై కాలు మోపిన ఎమ్మెల్యేపై ఆ వర్గం వారు కారాలు మిరియాలు నూరుతూ ఇప్పుడు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారారు.
ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని పద్మశాలీయులు డిమాండ్ చేస్తున్నారు.అధికార పార్టీని ఈ ఎపిసోడ్ మునుగోడులో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ నేతలు దీన్ని అనుకూలంగా మలుచుకొని ఆ వర్గం ఓట్లను సంపాదించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.