Begin typing your search above and press return to search.
ఈడీ ప్రశ్నలతో సుజనా ఉక్కిరిబిక్కిరి
By: Tupaki Desk | 4 Dec 2018 6:25 AM GMTకేంద్ర మాజీ మంత్రి - టీడీపీ ఎంపీ సుజనా చౌదరి పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డ్రిల్లింగ్ మొదలైంది. బ్యాంకులకు సుమారు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు నమోదైన కేసులో ఆయన్ను ఈడీ సోమవారం ప్రశ్నించింది. చెన్నై నుంగంబాక్కం లోని తమ కార్యాలయంలో మూడున్నర గంటలపాటు సుజనా పై ప్రశ్నల వర్షం కురిపించింది. అధికారుల ప్రశ్నలకు సుజనా ఉక్కిరిబిక్కిరయినట్లు తెలుస్తోంది.
సుజనా సంస్థల్లో ఈడీ ఇటీవల విస్తృత సోదాలు నిర్వహించింది. పలు డొల్ల కంపెనీల పేరుతో ఆయన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లు గుర్తించింది. దీంతో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీని పై సుజనా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను విచారణకు హాజరు కాలేనని మొరపెట్టుకున్నారు. అయితే - ఆయన విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సుజనా తన వ్యక్తిగత సహాయకుడు, న్యాయవాది తో కలిసి సోమవారం చెన్నైలో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు అధికారులు సుజనా గ్రూప్ సంస్థల్లో అక్రమాల పై ఆయన్ను ప్రశ్నించారు. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సుజనా నీళ్లు నమిలినట్లు తెలిసింది.
ఈడీ ఎదుట విచారణకు హాజరైన సమయంలో సుజనా చౌదరి మీడియా పై చిందులేశారు. తాను కార్యాలయం లోపలికి వెళ్తుండటాన్ని వీడియో తీస్తున్న పాత్రికేయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చాక.. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సుజనా సమాధానాలను పరిశీలించిన అనంతరం ఈడీ ఆయన్ను మరోసారి విచారణకు పిలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.