Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రుల తీరుతో ఎవరికి సిగ్గుచేటు?
By: Tupaki Desk | 5 Feb 2018 1:05 PM GMTబడ్జెట్ లో జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ స్పందిస్తున్న తీరు తెన్నులపై ఆ పార్టీ నాయకుల్లో కూడా అంతర్గతంగా అసంతృప్తే ఎక్కువగా ధ్వనిస్తోంది. జరిగిన అన్యాయం గురించి ఇప్పటిదాకా పార్టీ అధినేత కనీసం బహిరంగంగా నోరు విప్పి మాట్లాడకపోవడం.. ఢిల్లీలో పార్లమెంటు వెలుపల గాంధీ బొమ్మవద్ద మొక్కుబడి ధర్నాలు వీటితో ఫలితం ఉండదని పార్టీ కార్యకర్తలే ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి తూతూ మంత్రం చర్యలతో కేంద్రం మీద ఒత్తిడి పెంచడం అనేది సాధ్యమేనా.. మన చేతలను - మన నిరసనలను మోడీ సర్కార్ కామెడీ గా తీసుకున్నదంటే ఉన్న పరువు కూడా పోతుంది కదా అనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. నిర్దిష్టంగా చెంపపెట్టు లాంటి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే వృథా అని పలువురు అంటున్నారు.
కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం గనుక.. కేంద్రానికి కాక పుట్టించగల వ్యవహారం కూడా ఢిల్లీ కేంద్రంగానే ఉండాలన్నది అందరూ భావిస్తున్న సంగతి. బడ్జెట్ లో అన్యాయం జరిగింది అనే మాటను ఏదో ప్రభుత్వానికి వెలుపల ఉన్న పార్టీలు అంటే ప్రజలు సానుభూతితో అర్థం చేసుకుంటారు గానీ.. ప్రభుత్వంలో మంత్రి పదవులను కూడా వెలగబెడుతూ.. ఇలా బుకాయిస్తే.. ఛీత్కరిస్తారనేదే పలువురి భయం. అయితే తెదేపా తరఫున ఢిల్లీలో ఉన్న ఇద్దరు కేంద్రమంత్రుల తీరు పార్టీకి మరింత సిగ్గు చేటు వ్యవహారంలాగా తయారవుతున్నదని ఎంపీలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
సోమవారం నాడు పార్లమెంటు వద్ద నిరసనలు తెలియజేయడానికి ముఖ్యమంత్రి ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం దాకా వారితో భేటీ అయిన సీఎం - సోమవారం ఉదయం మళ్లీ టెలికాన్ఫరెన్స్ లో పచ్చజెండా ఎత్తారు. ఆమేరకు ఢిల్లీలో ధర్నాలు - నిరసనలు జరిగాయి. ట్విస్టు ఏంటంటే.. కేంద్రమంత్రులు సుజనాచౌదరి - అశోక్ గజపతి రాజు మాత్రం.. తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న ఈ నిరసనల్లో పాల్గొనలేదు. తాము ప్రభుత్వ పక్షమే తప్ప.. ప్రజల పక్షం కాదన్నట్లుగా వాళ్లు అంటీముట్టనట్టుగా దూరం ఉండిపోయారు.
తీరా మధ్యాహ్నం రాజ్ నాథ్ తో భేటీ జరిగిన వేళకు మాత్రం ఇద్దరు మంత్రులూ ఠంచనుగా హాజరయ్యారు. విభజన చట్టం ప్రసాదించే హామీలను తక్షణం అమలు చేయడం గురించి విన్నవించే ఈ కీలక భేటీలో తాము పాల్గొనక పోతే.. తమ గుర్తింపు, కీర్తి పోతుందని అనుకున్నారేమో అక్కడకు మాత్రం తయారుగా వచ్చారు. ప్రజల గళం వినిపించడానికి పదవీలాలసతో సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా జతకట్టే ధైర్యంలేని కేంద్ర మంత్రుల తీరుపై విమర్శలు టాప్ రేంజిలో వినిపిస్తున్నాయి. తెలుగుదేశం తమ స్పష్టమైన నిరసనను తెలియజేయాలంటే.. ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకు రానక్కర్లేదని, కానీ.. మోడీ సర్కారులో భాగంగా ఉంటే పరువు నష్టమేనని.. కనీసం ఇద్దరు కేంద్రమంత్రులతో రాజీనామా చేయిస్తే.. ప్రజల ముందు కాస్త పరువునిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పదవి కుర్చీ అంటేనే తుమ్మజిగురు తో అతికించుకోవాలని ఆశపడే నాయకులు ఆ పదవుల్ని వదులుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తారా? అనేదే ఇప్పుడు మీమాంస. మరి రాజీనామాల్లాంటి ఎలాంటి నిర్దిష్ట చర్యలు లేకుండా చంద్రబాబు ప్రజలను ఎలా ఫేస్ చేస్తారనేది కూడా సమస్యే!!