Begin typing your search above and press return to search.
టీడీపీ రాజ్యసభ ఎంపికలో బాబు మార్క్ ట్విస్ట్
By: Tupaki Desk | 30 May 2016 1:44 PM GMTరాజ్యసభకు జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహానాడు ముగిసిన వెంటనే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన చంద్రబాబు...ఆ మరుసటి రోజు విజయవాడలో క్యాంప్ ఆఫీస్ లో పార్టీ నేతలో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరి పేర్లు రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు అయినట్లు చెప్తున్నారు.
ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు ఉదయం నుంచి వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. ముందుగా పార్టీ నేతలతో, ఆ తర్వాత పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలతో, తిరిగి పార్టీ ముఖ్యులతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేంద్ర మంత్రి - ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తిరిగి పొడగింపు దక్కనుంది. ఆయనతో పాటు మరో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగి ఎన్నికల సమయంలో సైకిలెక్కిన టీజీ వెంకటేష్ పేరును ఓకే చేసినట్లు సమాచారం.
కొద్దికాలం క్రితం టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యే - వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమానాగిరెడ్డి చంద్రబాబుకు విన్నవించారు. తద్వారా రాయలసీమకు చెందిన సీనియర్ నేతకు గుర్తింపునిచ్చినట్లు అవుతుందని చెప్పారు. టీజీ పేరును ఓకే చేస్తే ప్రాంతీయ సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు అవుతుందని చెప్తున్నారు.