Begin typing your search above and press return to search.
టీడీపీ హోదా వాదనకు వెంకయ్య మళ్లీ మద్దతు
By: Tupaki Desk | 17 Aug 2016 11:02 AM GMTప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు తమను కార్నర్ చేయడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఏపీలో తీవ్ర ఆగ్రహానికి గురయిన ఆ పార్టీ ఇప్పుడు దీనిపై మాట్లాడడం మొదలుపెట్టింది. మరోవైపు ఏపీని ఖుషీ చేయడానికి కొంత న్యాయం చేయడానికి కూడా కసరత్తు చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా లేదా దాదాపు ఆ స్థాయి ప్యాకేజీ ఇచ్చేందుకు ఢిల్లీలో కేంద్రమంత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు నెలల్లో దీనిపై కసరత్తు ముగించి స్పష్టమైన ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ - వెంకయ్య నాయుడు - రాజ్ నాథ్ సింగ్.. కేంద్రమంత్రి - టిడిపి నేత సుజనా చౌదరిలు ఏపీ ప్రత్యేక హోదా - ప్యాకేజీల విషయమై చర్చలు జరిపారు. అయితే.. హోదాయా ప్యాకేజీయా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టతకు రాలేదు. పోలవరానికి కేంద్రం సాయం విషయంలోనూ ఎటూ తేలలేదు. విదేశీ రుణ ప్రాజెక్టుల కింద సాయం చేసే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీకి హోదా ఇవ్వాలని టిడిపి నేత - కేంద్రమంత్రి సుజనా చౌదరి పట్టుబట్టారని... ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వెంకయ్యనాయుడు కూడా సుజన చౌదరి వాదనకు మద్దతుకు పలికారని చెబుతున్నారు. గతంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన అన్నారని తెలుస్తోంది. అయితే, దీనిపై జైట్లీ మాత్రం ఇంకా బెట్టు వీడలేదని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే 11 రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తాయని - ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని జైట్లీ వారితో అన్నట్లు సమాచారం. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే హోదా ఇవ్వలేమని స్పష్టం చేసి ఉంటే పరిస్థితులు ఇంతవరకు వచ్చేవి కావని.. రెండేళ్లు నాన్చి ఇప్పుడు హోదా ఇవ్వలేమంటే రాజకీయంగా అందరం దెబ్బతింటామని టీడీపీ నేత సుజనా చౌదరి అనగా వెంకయ్య ఆయనతో ఏకీభవించారని చెబుతున్నారు.
అంతేకాదు... హోదా ఇస్తే మీ ప్రతిష్ఠ పెరుగుతుందని - ఎలాగైనా హోదాను ఇవ్వాలని సుజనా బీజేపీ పెద్దల వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే... జైట్లీ మాత్రం తమ వద్ద పదకొండు రాష్ట్రాల హోదా డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయని, ఏపీకి హోదా ఇస్తే మిగిలిన అన్ని రాష్ట్రాలు ఆగ్రహిస్తాయని ఆందోళన చెందుతున్నామని చెప్పారట. ప్రతి రాష్ట్రంలో ఇదే ఒక ఎన్నికల అంశంగా మారి బీజేపీ దారుణంగా దెబ్బతినే ప్రమాదముందని.. అది కాంగ్రెస్ కు లాభించి మళ్లీ ఆ పార్టీ పునరుజ్జీవానికి దారితీస్తే అందరం ఇబ్బంది పడతామని వాదించారట. అందుకే హోదాకు ప్రత్యామ్నాయంగా అదే స్థాయిలో ఆర్థిక సాయం చేస్తామని.. అందుకు అంగీకరించాలని సుజనాతో చెప్పడమే కాకుండా చంద్రబాబును కూడా ఒప్పించాలని సుజనాకే బాధ్యత అప్పగించారని చెబుతున్నారు. దీనిపై సుజనా ఏమీ అనలేక చంద్రబాబుతో మాట్లాడి చెబుతామన్నట్లుగా సమాచారం.