Begin typing your search above and press return to search.

చంద్రబాబు మౌత్ పీస్ గా సుజనా చౌదరి?

By:  Tupaki Desk   |   12 Aug 2019 5:30 PM GMT
చంద్రబాబు మౌత్ పీస్ గా సుజనా చౌదరి?
X
తను ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సుజనా చౌదరి అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు. సుజనా చౌదరి ప్రసంగాలను గమనిస్తున్న వాళ్లు ఈ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ సుజనా చౌదరి చంద్రబాబుకు మౌత్ పీస్ గా వ్యవహరిస్తూ ఉన్నారని వారు అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం చిత్తు అయిపోవడంతో తెలుగుదేశం నుంచి కొంతమంది బీజేపీలోకి వెళ్లి చేరిన సంగతి తెలిసిందే. వారిలో రాజ్యసభ సభ్యుడు అయిన సుజనా చౌదరి ఒకరు. ఈయన పార్టీ అయితే మారారు కానీ, తీరు మాత్రం మారలేదని నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు.

చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడితే సుజనా చౌదరి కూడా అదే మాట్లాడుతూ ఉన్నారని, చంద్రబాబు నాయుడు మాట్లాడింది మాట్లాడటమే చౌదరి పని అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారో, సుజనా చౌదరి దాన్నే రిపీట్ చేస్తూ ఉన్నారని, అలా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టే ఆయన వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు సుజనా చౌదరి తెలుగుదేశాన్ని వీడి బీజేపీలోకి చేరడం వెనుక చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి.

బ్యాంకులకు భారీ స్థాయిలో రుణాలను ఎగ్గొట్టారు అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు సుజనా చౌదరి. నకిలీ కంపెనీలను సృష్టించి వాటికి నిధులను మళ్లించారనే ఆరోపనలపై ఆయన సీబీఐ విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిని తప్పించుకోవడానికే ఆయన బీజేపీలోకి చేరారని సామాన్యులు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అలాంటి సుజనా చౌదరి మాట తీరు మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుగుణంగానే ఉందని, అచ్చం టీడీపీ నేలు ఎలా మాట్లాడతారో, ఈ ఎంపీ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా చంద్రబాబుకు సుజనా చౌదరి మౌత్ పీస్ గా మారారని, బీజేపలో ఉంటూ చంద్రబాబును విమర్శల నుంచి కాపాడుకునే పనిని సుజనా చౌదరి చేస్తున్నారనే అటాక్ వినిపిస్తోంది.