Begin typing your search above and press return to search.

వైసీపీ నేతలపై కంప్లైంట్ కాపీలు పంపమని మొయిల్ ఐడీ ఇచ్చిన సుజనా

By:  Tupaki Desk   |   21 Dec 2021 12:03 PM GMT
వైసీపీ నేతలపై కంప్లైంట్ కాపీలు పంపమని మొయిల్ ఐడీ ఇచ్చిన సుజనా
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించటమే కాదు.. ఆయనకు కుడి.. ఎడమ భుజాల్లో ఒకటిగా చెప్పే సుజనా చౌదరి.. పార్టీ మారటం తెలిసిన విషయమే. తన బాస్ బాబుకు హ్యాండిచ్చిన సుజనా.. బీజేపీలో చేరిన తర్వాత తెర వెనుక రాజకీయాలే తప్పించి.. బయటకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసింది కాస్త తక్కువ. ఇటీవల కాలంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. బయటకు వస్తున్న ఉదంతాల నేపథ్యంలో ఆయన స్పందించారు.

ఏపీ ముఖ్యమంత్రి.. మంత్రుల పేర్లతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయని పేర్కొన్న ఆయన.. కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినట్లుగా చెప్పారు. ఏపీ అధికారపక్ష ఎంపీల పేరుతో కబ్జాలకు పాల్పడటం ఎక్కువైందన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతాలు బయటకు వచ్చి సంచలనంగా మారిన.. విశాఖ జగదీశ్వరుడు.. ఒంగోలు సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ లను ప్రస్తావించారు.

ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆరాచకానికి పరాకాష్ఠగా పేర్కొన్న ఆయన.. ఇలాంటి ఘటనల్ని జరగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలన్నారు. వేధింపులకు భయపడకుండా బాధితులు పోలీసు స్టేషన్లలో కంప్లైంట్లు చేయాలన్న సూచన చేశారు.

అంతేకాదు.. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసిన కాపీలను తనకు పంపాలన్నారు. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పిన సుజనా చౌదరి.. తన మొయిల్ ఐడీని తాజాగా షేర్ చేశారు. saveandhrapradesh2022@gmail.com పేరుతో ఉన్న మొయిల్ ఐడీకి పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదులను పంపాలని ఆయన ట్వీట్ చేశారు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు మొయిల్ ఐడీ ఇచ్చి మరీ.. కంప్లైంట్లు తనకు పంపాలన్న సుజనా ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.