Begin typing your search above and press return to search.

బీజేపీకి తలనొప్పిగా మారుతున్న సుజనా చౌదరి!

By:  Tupaki Desk   |   6 Nov 2019 9:40 AM GMT
బీజేపీకి తలనొప్పిగా మారుతున్న సుజనా చౌదరి!
X
అలవిగాని నీతులు చెబుతూ ఉంటాడు సుజనా చౌదరి. మామూలుగా అయితే సుజనా చౌదరిని పార్టీ ఫిరాయింపే. అయితే విలీనం అంటూ దాన్నికవర్ చేశారు బీజేపీ వాళ్లు. రాజ్యసభలో తమకు బలం అవసరం కాబట్టి.. విలీనం ముసుగు వేసి సుజనా చౌదరిని తమ పార్టీలోకి చేర్చేసుకున్నారు.

ఇక అప్పటికే చౌదరి పై ఉన్న కేసుల సంగతి చెప్పనక్కర్లేదు. జాతీయ బ్యాంకులతో పాటు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కూడా అప్పులను తీసుకుని ఎగ్గొట్టాడు అనే ఖ్యాతిని ఆర్జించారు సుజనా చౌదరి. ఆ విషయంపై ఆయన సీబీఐ, ఈడీల ముందు కూడా హాజరయ్యారు.

అలాంటి ఇమేజ్ ఉన్నా బీజేపీవాళ్లు రాజ్యసభలో తమకు బలం అవసరం కాబట్టి ఈ చౌదరిని చేర్చుకున్నారు. ఇక బీజేపీ వాళ్లు ఈ మధ్య ఏపీలో బాగానే నీతులు చెబుతూ ఉన్నారు.

సీబీఐ, ఈడీలు కొంతమంది కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశాయి. ఈ నేపథ్యంలో అవినీతి పరుల భరతం పడుతున్నట్టుగా బీజేపీ వాళ్లు ప్రకటించుకుంటున్నారు. అయితే వారి మాటలకు సుజనా చౌదరి పంటికింద రాయిలా తగులుతూనే ఉన్నాడు.

ఈయన భారీ ఎత్తున అప్పులను తీసుకుని ఎగ్గొట్టాడు అనే ఆరోపణలు ఉండటం, కేసులు నడుస్తూ ఉండటంతో.. బీజేపీ వాళ్లు మాట్లాడేటప్పడు ప్రత్యర్థులు సుజనా చౌదరి పేరును ప్రస్తావిస్తూ ఉన్నారు.

'మీ పార్టీ ఎంపీ సంగతేంటి? ఆయన మీద ఎందుకు సీబీఐ-ఈడీ చర్యలు నిలిచిపోయాయి? బీజేపీలోకి చేరగానే పునీతుడు అయిపోయాడా?' అంటూ ప్రత్యర్థులు బీజేపీ నేతలను టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో ఈ విషయంలో సూటిగా సమాధానం ఇవ్వడానికి బీజేపీ వాళ్లు తటపటాయించుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.