Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా రద్దయిన కరెన్సీ ఒకటే
By: Tupaki Desk | 15 Nov 2016 2:05 PM GMTప్రత్యేక హోదా ఇదిగో అదిగో అంటూ ఊరించడమే కాకుండా డెడ్ లైన్లు కూడా విధించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటరీ సమావేశాల నేపథ్యంలో విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలుగుదేశం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతపై పార్లమెంటులో పట్టుబట్టాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణం మంజూరుపై ప్రకటన రావాలన్నారు. వారం రోజుల్లో కేంద్రం నుంచి ప్రకటన వచ్చేలా చేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై సమావేశాల్లో పట్టుబట్టాలని, ఏపీకి రావలసిన సాయం సత్వరమే అందేలా పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యేక హోదా చెల్లని రూ.500 - 1000 నోట్ల లాంటిదన్నారు. రాని ప్రత్యేక హోదాను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. జనవరి తర్వాత పాత నోట్లు పనికి రావని చెప్పిన సుజనా అదే రీతిలో ఇకపై రాష్ట్రానికి ఏది అవసరమో దానిపైనే ప్రధానంగా దృష్టిసారించాలని సుజనా చౌదరి సూచించారు. పోలవరం అంశంపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చిందన్నారు. తాజాగా కొనసాగుతున్న నోట్ల రద్దు అంశంపై స్పందిస్తూ పెద్ద నోట్లు రద్దుచేయాలని గతంలోనే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారని గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నకిలీ నోట్లు పూర్తిగా తొలగిపోయాయని సుజనా చౌదరి తెలిపారు. నోట్ల రద్దు వల్ల సామాన్యుల ఇబ్బందుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. లెక్కల్లోకి రాని డబ్బులు వెలుగులోకి వస్తే సంక్షేమ పథకాలు అమలుచేయవచ్చన్నారు. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేపట్టిన మెరుపుదాడుల్ని తాము ప్రశంసిస్తున్నట్లు చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/